కోహ్లి సరసన పుజారా..!

3 Jan, 2019 10:53 IST|Sakshi

సిడ్నీ:  ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో తనదైన మార్కు ఆట తీరుతో ఆకట్టుకుంటూ భారత్‌ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న చతేశ్వర్‌ పుజారా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆసీస్‌తో నాల్గో టెస్టులో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో పుజారా ఒక మైలురాయిని చేరుకున్నాడు. ఆస్ట్రేలియాలో ఒక టెస్టు సిరీస్‌లో వెయ్యికి పైగా బంతుల్ని ఆడిన భారత ఆటగాళ్ల జాబితాలో పుజారా చేరిపోయాడు.  తొలి ఇన్నింగ్స్‌లో 134 బంతులాడిన పుజారా అర్థ శతకాన్ని సాధించాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాలో ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో వెయ్యి బంతుల్ని ఆడిన ఘనత నమోదు చేశాడు. అంతకముందు 2014-15 సీజన్‌లో భాగంగా ఆసీస్‌లో పర‍్యటించినప్పడు కోహ్లి వెయ్యి బంతుల్ని ఆడాడు. ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటనలో  వెయ్యికి పైగా బంతుల్ని ఆడిన పుజారా.. ఆసీస్‌ బౌలర్లకు చెమటలు పట్టిస్తున్నాడు.

అంతకముందు ఆస్ట్రేలియాలో ఒక టెస్టు సిరీస్‌లో వెయ్యికి పైగా బంతులు ఆడిన భారత క్రికెటర్లలో రాహుల్‌ ద్రవిడ్‌( 2003-04 సీజన్‌లో 1203 బంతులు), విజయ్‌ హజారే(1947-48 సీజన్‌లో 1192 బంతులు), కోహ్లి(2014-15 సీజన్‌లో 1093 బంతులు)సునీల్‌ గావస్కర్‌(1977-78 సీజన్‌లో 1032 బంతులు) వరుస స్థానాల్లో ఉన్నారు.

మయాంక్‌ మరో రికార్డు

మరిన్ని వార్తలు