పుజారా డబుల్‌ సెంచరీ మిస్‌

4 Jan, 2019 08:37 IST|Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్‌ పుజారా తృటిలో డబుల్‌ సెంచరీ చేసే అవకాశం కోల్పోయాడు. ద్విశతకానికి ఏడు పరుగుల దూరంలో అతడు అవుటయ్యాడు. 373 బంతుల్లో 22 ఫోర్లతో 193 పరుగులు చేసి లయన్‌ బౌలింగ్‌లో ఆరో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. డబుల్‌ సెంచరీ చేజారడంతో నిరాశగా మైదానాన్ని వీడాడు.  టీమిండియా 491/6 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. రిషబ్‌ పంత్‌ అర్ధ సెంచరీ చేశాడు. అతడికి తోడుగా రవీంద్ర జడేజా(25) క్రీజ్‌లో ఉన్నాడు. (మొదటి రోజు...మనదే జోరు)

టెస్టుల్లో పుజారా ఇప్పటివరకు మూడు డబుల్‌ సెంచరీలు చేశాడు. ఇందులో రెండు ఆస్ట్రేలియాపైనే సాధించడం విశేషం. టెస్టుల్లో అతడి వ్యక్తిగత అత్యధిక స్కోరు 206 నాటౌట్‌. 2012, నవంబర్‌లో అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడీ స్కోరు సాధించాడు. 2013, మే నెలలో హైదరాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 204 పరుగులు చేశాడు. 2017, మార్చిలో ఆసీస్‌తోనే జరిగిన మ్యాచ్‌లోనూ డబుల్‌ సెంచరీ(202) కొట్టాడు.

మరిన్ని వార్తలు