పింక్ బాల్పై పూజారా అభ్యంతరం!

6 Sep, 2016 13:39 IST|Sakshi
పింక్ బాల్పై పూజారా అభ్యంతరం!

గ్రేటర్ నోయిడా:  దేశవాళీ ఫస్ట్క్లాస్ టోర్నీలో భాగంగా దులీప్ ట్రోఫీలో తొలిసారి ఫ్లడ్ లైట్ల వెలుతురులో ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్న పింక్ బంతులపై చటేశ్వర పూజారా పలు అభ్యంతరాలు వ్యక్తం చేశాడు. ప్రత్యేకంగా మూడో సెషన్లో లైట్ల వెలుతురులో కొత్త బంతిని ఆడటం తనకు అత్యంత ఇబ్బందిగా అనిపించిందని పూజారా తెలిపాడు. అటు పేస్ బౌలర్లు సంధించే బంతులను ఎదుర్కోవడంతో పాటు, ఇటు స్పిన్నర్లు వేసే గూగ్లీలను ఆడేటప్పుడు కూడా సమస్య తలెత్తినట్లు తెలిపాడు.

'ఇది పింక్ బాల్తో నా తొలి గేమ్. ఈ వికెట్ పై బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదించా. అయితే దీనివల్ల ఫాస్ట్ బౌలర్లకు ఎక్కువ ప్రయోజనం చేకూరకపోవచ్చు.   రెండో కొత్త బంతితో వేసే మూడో సెషన్ ఇబ్బందిగా ఉంది. మరోవైపు లైట్ల వెలుతురులో స్పిన్నర్లు వేసే గూగ్లీని ఆడటం కష్టంగానే ఉంది. నా అభిప్రాయం ప్రకారం మూడో సెషన్ అనేది ఓవరాల్గా అత్యంత కష్టంగా అనిపించింది'అని పూజారా తెలిపాడు. ఇండియా బ్లూ-ఇండియా గ్రీన్ జట్ల మధ్య జరుగుతున్న మూడో లీగ్ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ అనంతరం పూజారా పింక్ బాల్ పై స్పందించాడు. ఈ మ్యాచ్ లో పూజారా(166;280 బంతుల్లో 24 ఫోర్లు) భారీ శతకం సాధించాడు.

>
మరిన్ని వార్తలు