అజయ్, సౌరభ్‌ సత్తా చాటుతారా! 

2 Oct, 2018 00:45 IST|Sakshi

నేటినుంచి చైనీస్‌ తైపీ  బ్యాడ్మింటన్‌ టోర్నీ  

తైపీ సిటీ: స్టార్‌ షట్లర్లు దూరమైన చైనీస్‌ తైపీ వరల్డ్‌ టూర్‌ సూపర్‌ 300 టోర్నమెంట్‌లో సత్తా చాటా లని భారత ఆటగాళ్లు అజయ్‌ జయరామ్, సౌరభ్‌ వర్మ పట్టుదలగా ఉన్నారు. నేటినుంచి జరిగే ఈ టోర్నీకి పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌లు  దూరంగా ఉన్నారు. ఈ నెలలోనే కీలకమైన డెన్మార్క్‌ ఓపెన్‌ (16 నుంచి 21 వరకు), ఫ్రెంచ్‌ ఓపెన్‌ (23 నుంచి 28 వరకు) టోర్నీలు ఉండడమే దీనికి కారణం.  ఈ నేపథ్యంలో అజయ్‌ జయరామ్, మాజీ జాతీయ చాంపియన్‌ సౌరభ్‌ వర్మ లకు ఇది మంచి అవకాశం. మహిళల సింగిల్స్‌లో తెలుగమ్మాయిలు చుక్కా సాయి ఉత్తేజిత రావు, శ్రీకృష్ణప్రియలు బరిలోకి దిగుతున్నారు. వియ త్నాం, వైట్‌నైట్స్‌ టోర్నీలో ఫైనల్‌ చేరిన అజయ్‌ జయరామ్‌ ఈ టోర్నీలో టైటిల్‌పై కన్నేశాడు.

తొలిరౌండ్లో అతను జపాన్‌కు చెందిన హషిరు షిమోనోతో తలపడనుండగా...  ప్రపంచ 65వ ర్యాంకర్‌ సౌరభ్‌ వర్మ స్థానిక ఆటగాడు లీ చియ హవ్‌ను ఎదుర్కొంటాడు. మిగతా మ్యాచ్‌ల్లో చిట్టబోయిన రాహుల్‌... లు చియ హుంగ్‌ (తైపీ)తో, అభిషేక్‌... ఐదో సీడ్‌ జాన్‌ జొర్గెన్సన్‌ (డెన్మార్క్‌)తో పోటీపడతారు. మహిళల సింగిల్స్‌లో ఉత్తేజిత... చియాంగ్‌ యింగ్‌ లీ (తైపీ)తో, ముగ్ధ అగ్రే... ఏడో సీడ్‌ సోనియా (మలేసియా)తో, శ్రీకృష్ణప్రియ... లిన్‌ యింగ్‌ చన్‌ (తైపీ)తో తలపడనున్నారు. పురుషుల డబుల్స్‌లో ఒక్క తరుణ్‌ కోన మాత్రమే ఆడుతున్నాడు. అతను మలేసియాకు చెందిన లిమ్‌ కిమ్‌ వాతో జతకట్టగా, మహిళల డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత షట్లర్లు ఎవరూ పాల్గొనడం లేదు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

క్రికెట్‌కు వేణు గుడ్‌బై 

భారత హెడ్‌ కోచ్‌ పదవి రేసులో జయవర్ధనే! 

డోప్‌ టెస్టులో పృథ్వీ షా  విఫలం 

భారత యువతిని పెళ్లాడనున్న పాక్‌ క్రికెటర్‌ 

అదంతా ఒట్టి భ్రమే! 

వచ్చేసింది.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 

యువీ సరదా ప్రశ్న.. ‘మీ ఇద్దరి పెళ్లెప్పుడు’

‘టీమిండియా కోచ్‌కు అవే ప్రధానం’

ఒక్క క్లిక్‌తో క్రీడా వార్తలు

ప్రొఫెషనల్‌ క్రికెటర్లూ.. ఈ క్యాచ్‌ను నోట్‌ చేసుకోండి!

కోహ్లి.. నీకిది తగదు!

గావస్కర్‌కు మంజ్రేకర్‌ కౌంటర్‌!

యువరాజ్‌ దూకుడు

ఎఫైర్ల వివాదంలో పాక్‌ క్రికెటర్‌ క్షమాపణలు

గేల్‌ మెరుపులు.. ఆకాశంలో ఉరుములు!

‘టీమిండియాకు గట్టిపోటీ తప్పదు’

దీపా కర్మాకర్‌ ఇంకా కోలుకోలేదు

సహజశ్రీకి డబ్ల్యూఐఎం హోదా

కావ్య, నందినిలకు స్వర్ణాలు

అంతా నాన్సెన్స్‌ : రవిశాస్త్రి

వైదొలిగిన సింధు

16 ఏళ్ల రికార్డు బద్దలు

గట్టెక్కిన పట్నా పైరేట్స్‌

రోహిత్‌తో విభేదాలు.. అబద్ధపు ప్రచారమని కోహ్లి ఆవేదన

బెంగాల్‌ చేతిలో పుణెరి చిత్తుచిత్తుగా..

టెస్టు చాంపియన్‌షిప్‌పై స్పందించిన కోహ్లి

తమిళ్‌ తలైవాస్‌కు పట్నా షాక్‌

అలాంటిదేమి లేదు.. కోహ్లి వివరణ

ఆఫ్రిది ఆగయా.. బౌండరీ జాయేగా..

ఇదేమి సెలక్షన్‌ కమిటీరా నాయనా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

800లో భాగస్వామ్యం

తప్పు చేయలేదు.. సారీ చెప్పలేదు

నిర్మాత చేయి ఎప్పుడూ పైనే ఉండాలి

నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే...

బిగ్‌బాస్‌ హౌస్‌లో వంటగ్యాస్‌, నీళ్లు కట్‌

‘ప్రేమ చూపిస్తున్నారా.. దాడి చేస్తున్నారా?’