శర్వాణ్‌... నీవు కరోనా వైరస్‌ కంటే డేంజర్‌: గేల్‌ 

29 Apr, 2020 02:35 IST|Sakshi

జమైకా: వెస్టిండీస్‌ జట్టు సహచరుడు రామ్‌నరేశ్‌ శర్వాణ్‌పై డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. శర్వాణ్‌ కరోనా మహమ్మారి కంటే చెత్త అని అన్నాడు. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో గేల్‌ ప్రాతినిధ్యం వహించిన జమైకా తలవాస్‌ జట్టుకు శర్వాణ్‌ సహాయ కోచ్‌. అయితే ఈ సీజన్‌లో ఫ్రాంచైజీ తనను రీటెయిన్‌ చేసుకోకుండా వదిలించుకోవడానికి శర్వాణే కారణమని గేల్‌ ఆరోపించాడు. ఆ ఫ్రాంచైజీని తన నియంత్రణలో ఉంచుకునేందుకు శర్వాణ్‌ పావులు కదుపుతున్నాడని గేల్‌ విమర్శించాడు. ‘శర్వాణ్‌... నువ్వు పాములాంటోడివి. ప్రతీకారం తీర్చుకునేందుకు విషం చిమ్ముతావు. వెన్నుపోటు పొడిచి చంపడానికి కూడా వెనుకాడవు. ఇప్పుడున్న కరోనా వైరస్‌ కంటే నీవే ప్రమాదకరం’ అని తీవ్ర విమర్శలు చేసిన వీడియోను తన యూట్యూబ్‌ చానెల్‌లో క్రిస్‌ గేల్‌ అప్‌లోడ్‌ చేశాడు.  

మరిన్ని వార్తలు