'ఆ తరువాతే లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నా'

10 Sep, 2016 12:46 IST|Sakshi
'ఆ తరువాతే లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నా'

న్యూఢిల్లీ: గతంలో తాను చేయించుకున్నహార్ట్ సర్జరీ జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో నేర్పిందని వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ స్పష్టం చేశాడు. తాను సర్జరీ చేయించుకున్నతరువాత జీవిత పరమార్థం బోధ పడిందని తెలిపాడు. దాదాపు 11 సంవత్సరాల క్రితం వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా గుండె సంబంధిత సమస్య తీవ్రంగా ఇబ్బంది పడిన గేల్.. అదే సమయంలో సర్జరీ చేయించుకున్నాడు.

 

ఈ విషయంపై స్పందించిన గేల్.. తాను సర్జరీ చేయించుకునే సమయానికి గుండెలో రంధ్రం ఉన్న సంగతి ఎవ్వరికీ  తెలియదన్నాడు. ' ఆస్ట్రేలియా పర్యటనలో గుండె సమస్యతో బాధపడ్డా. ఆస్ట్రేలియాలోని చికిత్స చేయించుకోవడానికి వెళితే గుండెలో హోల్ ఏర్పడినట్లు డాక్టర్లు చెప్పారు. అప్పటివరకూ నా సమస్య ఏ ఒక్కరికీ తెలియదు. కనీసం నా తల్లి దండ్రులకు కూడా ఈ విషయం తెలియదు. అయితే హార్ట్ సర్జరీకి వెళుతున్న విషయాన్ని మాత్రమే తల్లి దండ్రులకు చెప్పా'అని తన ఆత్మకథ '‘సిక్స్ మెషీన్-ఐ డోన్ట్ లైక్ క్రికెట్... ఐ లవ్ ఇట్’ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమానికి ఢిల్లీ వచ్చిన గేల్ తెలిపాడు.  ఆ తరువాత జీవితం విలువ ఏమిటో జ్ఞానబోధ అయినట్లు గేల్ అన్నాడు. ఆ సర్జరీ తన మొత్తం జీవిత శైలినే మార్చేసిందని, ఆ క్రమంలోనే ఎంజాయ్ చేయడం మొదలు పెట్టానని పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు