పాకిస్తాన్‌ ఇప్పుడు సురక్షితమైన ప్రదేశం : గేల్‌

10 Jan, 2020 15:50 IST|Sakshi

ఢాకా : ప్రపంచంలోనే  ఇప్పుడు  అత్యంత సురక్షితమైన ప్రదేశాలలో పాకిస్తాన్‌ ఒకటని విండీస్‌ స్టార్‌ బ్యాట్సమెన్‌ క్రిస్‌ గేల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రసుత్తం పాకిస్తాన్‌లో సిరీస్‌ ఆడేందుకు వచ్చే జట్టులోని ఆటగాళ్లకు ఆ దేశ ప్రభుత్వం ఒక అధ్యక్షుడి స్థాయి భద్రతను కల్పిస్తుందని పేర్కొన్నాడు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న బంగ్లా ప్రీమియర్‌ లీగ్‌లో గేల్‌ ఛటోగ్రామ్ ఛాలెంజర్స్‌ తరపున ఆడేందుకు వచ్చాడు. ప్రాక్టీస్‌ సందర్భంగా 'పాకిస్తాన్‌ క్రికెట్‌ ఆడేందుకు అనువైన ప్రదేశం అవునా కాదా ' అంటూ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు గేల్‌ స్పందిస్తూ... ' ఇప్పుడు ప్రపంచంలోనే పాకిస్తాన్‌ దేశం అత్యంత సురక్షితమైనది. ఎందుకంటే ఆ దేశంలో క్రికెట్‌ ఆడేందుకు వస్తున్న ఆటగాళ్లకు అధ్యక్షస్థాయి భద్రతను కల్పిస్తున్నారు. ఒక ఆటగాడిగా ఇంతకన్నా కావలిసిందేముంటుంది' అంటూ పేర్కొన్నాడు. కాగా దశాబ్దం తర్వాత శ్రీలంక జట్టు టెస్టు సిరీస్‌ ఆడేందుకు పాక్‌ గడ్డపై అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో లంక ఆటగాళ్లకు పాక్‌ ప్రభుత్వం పటిష్ట భద్రతను ఏర్పాటు చేసింది.  కాగా రెండు టెస్టుల సిరీస్‌ను పాకిస్తాన్‌ 1-0 తేడాతో గెలుచుకుంది. అయితే గేల్‌ ఈ మధ్యనే 40లోకి ఎంటరవ్వడంతో అతని రిటైర్మంట్‌పై ఊహాగానాలు వస్తున్నాయి. అయితే వాటన్నింటికి తెరదించుతూ ఇంకో ఐదేళ్ల పాటు తనకు​ క్రికెట్‌ ఆడే శక్తి ఉన్నట్లు గేల్‌ ఇప్పటికే ప్రకటించాడు.  

మరిన్ని వార్తలు