జహీర్‌, ద్రవిడ్‌ అనుమానమేనా!

16 Jul, 2017 10:26 IST|Sakshi
జహీర్‌, ద్రవిడ్‌ అనుమానమేనా!

రవిశాస్త్రి ఎంపికకే సీఓఏ ఆమోదం  
న్యూఢిల్లీ: టీమిండియా కోచ్‌ల నియామక ప్రక్రియ అనేక మలుపులు తిరుగుతోంది. శనివారం సమావేశమైన పరిపాలక కమిటీ (సీఓఏ) హెడ్‌ కోచ్‌గా రవిశాస్త్రి ఎంపికపైనే ఆమోద ముద్ర వేసింది. అయితే బౌలింగ్‌ కోచ్‌ జహీర్‌ ఖాన్, బ్యాటింగ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ల నియామకంపై కమిటీ ఏ నిర్ణయమూ తీసుకోలేదు. జట్టు సహాయక సిబ్బందిని ఈనెల 22న రవిశాస్త్రిని సంప్రదించాకే నియమించే అవకాశం ఉంది. సమావేశంలో వినోద్‌ రాయ్, డయానా ఎడుల్జీలతో పాటు బీసీసీఐ సీఈవో రాహుల్‌ జోహ్రి పాల్గొన్నారు. అయితే బోర్డు చెబుతున్నట్టుగా విదేశీ పర్యటనలోనైనా జహీర్, ద్రవిడ్‌ జట్టుతో పాటు ఉంటారా? అనే విషయంలో కమిటీ స్పష్టతనివ్వడం లేదు.

శాస్త్రి వేతనంపై కమిటీ
కోచ్‌ రవిశాస్త్రికి, సహాయక సిబ్బందికి ఎంత మొత్తం ఇవ్వాలనే విషయంపై నలుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటయ్యింది. ఇందులో డయానా ఎడుల్జీ, బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా, సీసీవో జోహ్రి, కార్యదర్శి అమితాబ్‌ చౌదరీ సభ్యులుగా ఉంటారు. ఈనెల 19న వీరు తొలిసారిగా సమావేశం కానున్నారు. తమ ప్రతిపాదనలతో ఈ కమిటీ 22న సీఓఏకు నివేదిక ఇస్తుంది.

టీమ్‌ మేనేజర్‌ కోసం దరఖాస్తుల ఆహ్వానం
ముంబై: సహాయక సిబ్బంది ఎంపిక ఇంకా నలుగుతుండగానే బీసీసీఐ.. టీమ్‌ మేనేజర్‌ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈనెల 21లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపిౖకైన వారు ఏడాది కాలం పాటు పదవిలో ఉంటారని, అభ్యర్థులు ఫస్ట్‌ క్లాస్‌/అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌ల్లో ఆడిన అనుభవం ఉండాలని కోరింది.

>
మరిన్ని వార్తలు