కోచ్ రేసులో ప్రసాద్, సంధు

9 Jun, 2016 00:28 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కోచ్ పదవిపై మాజీ బౌలర్లు వెంకటేశ్ ప్రసాద్, బల్విందర్ సంధు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ మేరకు కోచ్ పదవికి బుధవారం దరఖాస్తు చేసినట్లు వారు వెల్లడించారు. ప్రస్తుతం వెంకటేశ్ ప్రసాద్ బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

అంతేకాకుండా 2007లో ధోని సారథ్యంలో టి20 ప్రపంచకప్ గెలిచిన సమయంలో టీమిండియా బౌలింగ్ కోచ్‌గా పనిచేశారు. 1983లో ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన సంధు... ముంబై రంజీ ట్రోఫీ జట్టుతో పాటు, మహారాష్ట్ర, బరోడా రాష్ట్ర జట్లకు కోచ్‌గా పనిచేశారు. ఈ నెల 10వరకు దరఖాస్తులకు గడువు ఉంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు