భారత్ రానున్న ఐఓసీ చీఫ్ 27న ప్రధానితో థామస్ బాచ్ భేటీ

21 Apr, 2015 00:35 IST|Sakshi
భారత్ రానున్న ఐఓసీ చీఫ్ 27న ప్రధానితో థామస్ బాచ్ భేటీ

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ రెండు రోజుల పర్యటన కోసం భారత్‌కు ఈ నెల 26న రానున్నారు. 2013లో ఐఓసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన బాచ్, భారత్‌కు రావడం ఇదే తొలిసారి.

భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఎగ్జిక్యూటివ్ కమిటీతో సమావేశం కానున్న బాచ్... ప్రధాని నరేంద్ర మోదిని 27న కలవనున్నారు. 2024 ఒలింపిక్స్ నిర్వహణ కోసం భారత్ బిడ్ వేస్తుందని ఇటీవల వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా