మెస్సీ 600వ గోల్‌.. ఓ పండగ..!!

2 May, 2019 11:17 IST|Sakshi

క్యాటలోనియా : స్టేడియంలో ఆటగాళ్ల ప్రదర్శన పట్ల తమదైన శైలిలో వ్యాఖ్యానించడం.. ప్రేక్షకుల్లో జోష్‌ పెంచడం సాధారణంగా కామెంటేటర్ల పని. కానీ, ప్రపంచం ఆరాధించే, తను అత్యంత అభిమానించే గోల్‌ మాస్టర్‌, అర్జెంటీనా స్టార్‌ ఫుట్‌బాలర్‌ లియోనెల్‌ మెస్సీ అద్భుతాలకే అద్భుతం అనిపించే గోల్‌ సాధిస్తే.. ఎవరైనా ఎగిరి గంతేస్తారు. ఇంగ్లండ్‌ మాజీ ఫుట్‌బాలర్‌, కామెంటేటర్‌ గ్యారీ లైన్కేర్ కూడా అదే చేశారు. బార్సీలోనా తరపున మెస్సీ 600వ గోల్‌ సాధించడంతో లైన్కేర్ ఆనందంతో ఊగిపోయారు. ‘వావ్‌’ అంటూ కామెంటరీ క్యాబిన్‌లో సహచరుడు లియో గార్సియోతో హ్యాపీ మూమెంట్స్‌ షేర్‌ చేసుకున్నారు.ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. చాంపియన్స్‌ లీగ్‌లో భాగంగా బుధవారం జరిగిన లివర్‌పూల్‌-బార్సిలోనా సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది.

తొలుత లూయిస్‌ స్వారెజ్‌ ఓ గోల్‌ సాధించడంతో బార్సిలోనా 1-0 ఆదిక్యంలో నిలిచింది. అనంతరం మెస్సీ మరో రెండు గోల్స్‌ సాధించి తన టీమ్‌ను 3-0 ఆదిక్యంలోకి తీసుకెళ్లడంతో బార్సిలోనా ఘన విజయం సాధించింది. ఆట మరో 7 నిముషాల్లో ముగుస్తుందనగా మెస్సీ ఫ్రీ కిక్‌ను గోల్‌గా మలిచిన తీరుతో అటు కామెంటేటర్లు ఇటు అభిమానులు ఫిదా అయ్యారు. మెస్సీ చేసిన ఈ గోల్‌ (బార్సిలోనా తరపున 600వది) చర్రిత్రాత్మకం అని గ్యారీ లైన్కేర్,  లియో గార్సియో పేర్కొన్నారు. మ్యాచ్‌ అనంతరం మెస్సీ మాట్లాడుతూ.. ‘ఎప్పుడూ లేనంతగా ఈ రోజు మేం సమష్టిగా రాణించాం. అందుకే ఈ గెలుపు సాధ్యమైంది. మొదటి గోల్‌ సాధించి స్వారెజ్‌ మా గెలుపునకు బాటలు వేశాడు’ అని చెప్పుకొచ్చాడు. 31 ఏళ్ల మెస్సీ ఇప్పటికే తన ఫుట్‌బాల్ ప్రొఫెషనల్ కెరీర్‌లో 600 గోల్స్‌ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా