అమాంతం పెరిగిన పీవీ సింధు బ్రాండ్ వాల్యూ

26 Aug, 2016 16:58 IST|Sakshi
అమాంతం పెరిగిన పీవీ సింధు బ్రాండ్ వాల్యూ

మొన్నటివరకు వర్ధమాన షట్లర్గానే ఉన్న పీవీ సింధు.. రియో ఒలింపిక్స్లో రజత పతకం సాధించడంతో ప్రపంచ బ్యాడ్మింటన్ స్టార్ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలు పడి సింధుకు ప్రోత్సాహకాలు ప్రకటించాయి. సన్మానాలు చేశారు. ఉద్యోగాలు ప్రకటించారు. రియోలో రజతపతకం సాధించాక ఈ తెలుగుతేజం కెరీర్ మారిపోయింది. సింధు బ్రాండ్ వాల్యూ ఎన్నో రెట్లు పెరిగింది. ఆమెతో వాణిజ్య ప్రకటనల ఒప్పందాలు చేసుకోవడానికి పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో రజతం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

సింధు బ్రాండ్ వాల్యూ మరింత పెరుగుతుందని, ఒప్పందాలు చేసుకోవడంలో తొందరపడబోమని ఆమె ఎండార్స్మెంట్ వ్యవహారాలను చూస్తున్న బ్రాండ్ మేనేజ్మెంట్ సంస్థ బేస్లైన్ వెంచర్స్ భావిస్తోంది. సింధుతో రెండు ఎండార్స్మెంట్ ఒప్పందాలను త్వరలో ప్రకటించనున్నట్టు సమాచారం. బేస్లైన్ వెంచర్స్ డైరెక్టర్ ఆర్ రామకృష్ణన్ మాట్లాడుతూ.. ఒలింపిక్స్కు ముందు ఈ ఎండార్స్మెంట్ ఒప్పందాలు జరిగాయని, సింధు సన్నాహకాల్లో తీరికలేకుండా ఉండటంతో ప్రకటించలేదని చెప్పారు. ఇవి జాతీయ స్థాయిలో మేజర్ ఎండార్స్మెంట్స్ అని చెప్పారు.

మరిన్ని వార్తలు