పంట పండింది!

24 Jun, 2014 01:33 IST|Sakshi
పంట పండింది!

ఫుట్‌బాల్ ప్రపంచకప్ సందర్భంగా బ్రెజిల్‌లో కండోమ్‌లు తయారుచేసే కంపెనీల పంట పండింది. ముఖ్యంగా ప్రుడెన్స్ అనే కంపెనీ దీనిని బాగా సొమ్ము చేసుకుంది. బ్రెజిల్ ప్రజలకు బాగా ఇష్టమైన పానీయం ‘కైపిరిన్హా’ ఫ్లేవర్‌తో ఈ కంపెనీ ఓ కండోమ్‌ను ప్రపంచకప్ సందర్భంగా విడుదల చేసింది. దీని ధర 84 రూపాయలు.

ఈ కంపెనీలు మూడు నెలలకు సరిపోతాయని భావించి 8.5 లక్షల కండోమ్స్ ఉత్పత్తి చేసింది. అయితే కేవలం 15 రోజుల్లోనే అన్నీ అమ్ముడయ్యాయి. ప్రపంచకప్‌కు వచ్చిన విదే శీయులు అతి చౌకైన జ్ఞాపికగా ఈ కండోమ్‌ను తీసుకువెళుతున్నారేమో అని బ్రెజిల్ అధికారులు వ్యాఖ్యానించడం విశేషం.
 

మరిన్ని వార్తలు