బౌలింగ్‌లో చెలరేగిన చైతన్య

23 Oct, 2013 00:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: డీజీజే చైతన్య (5/27) అద్భుత బౌలింగ్‌తో చెలరేగడంతో గెలాక్సీ జట్టుపై కాంటినెంటల్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. హెచ్‌సీఏ ‘ఎ’ డివిజన్ రెండు రోజుల లీగ్ పోటీల్లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గెలాక్సీ 76 పరుగులకే కుప్పకూలింది. శశిధర్ ఒక్కడే రాణించి 40 పరుగులు చేశాడు. అనంతరం కాంటినెంటల్ వికెట్ నష్టానికి 79 పరుగులు చేసి విజయాన్నందుకుంది. రోహిత్ రెడ్డి (50) అర్ధ సెంచరీతో జట్టును గెలిపించాడు.
 
 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
 గుజరాతీ: 220 (మనోజ్ 42, బల్జీత్ సింగ్ 38, సురేశ్ 3/48); స్పోర్టింగ్ ఎలెవన్: 189 (వికాస్ మోహన్ 57, నదీముద్దీన్ 47, ధారస్ వర్ధన్ 6/50)పై గెలుపు.
 
  పి అండ్ టి కాలనీ: 169 (అభిషేక్ కుమార్ 5/54, స్టీవెన్ సన్ 3/39); నిజాం కాలేజి: 157 (శరత్ కుమార్ 91, తఖీయుల్లా 3/32, ఉత్తమ్ కుమార్ 3/35, అజయ్ రావత్ 3/56)పై గెలుపు.
 ఎస్‌ఏ అంబర్‌పేట్: 173 (షహబాజ్ 43 నాటౌట్, ఫహీం 34, జయసూర్య 5/39); తెలంగాణ: 71/2 (అనురాగ్ 39 నాటౌట్)తో డ్రా.
 
 సుల్తాన్ షాహీ: 343/9 (వినయ్ కుమార్ 160 నాటౌట్, అశ్విన్ విజయ్ 62, మనీశ్ పరాశర్ 5/121); బడ్డింగ్ స్టార్స్: 186/4 (తుషార్ సక్లాని 92, శిరీష్ గౌడ్ 37)తో డ్రా. సీసీఓబీ: 189 (అబ్దుల్ మన్నన్ 89, మార్క్ 4/35, పర్గత్ సింగ్ 3/45); ఖల్సా: 121/5 తో డ్రా.హెచ్‌బీసీసీ: 217 (అమేయ సోమన్ 152); సాయి సత్య: 121/7 (మికిల్ జైస్వాల్ 49)తో డ్రా.  ఉస్మానియా: 156 (సంతోష్ రెడ్డి 54, బి.ప్రసాద్ 4/29); నేషనల్: 13/0 తో డ్రా.
 

మరిన్ని వార్తలు