కోపా అమెరికా కప్ లో సంచలనం

13 Jun, 2016 10:57 IST|Sakshi
కోపా అమెరికా కప్ లో సంచలనం

మసాచుసెట్స్: కోపా అమెరికా కప్ టోర్నీలో పెను సంచలనం చోటు చేసుకుంది. ఫేవరేట్లలో ఒకటైన బ్రెజిల్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. వివాదస్పద గోల్ తో బ్రెజిల్ ను పెరూ ఓడించింది. 31 ఏళ్ల తర్వాత తొలిసారిగా బ్రెజిల్ పై పెరూ విజయం సాధించింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన గ్రూప్-బీ లీగ్ మ్యాచ్‌లో 1-0తో బ్రెజిల్ పై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో కొలంబియాతో పెరూ తలపడుతుంది.

ఆట 75వ నిమిషంలో పెరూ ఆటగాడు రాల్ రూడియాజ్ చేసిన గోల్ వివాదస్పదంగా మారింది. అతడు చేత్తో గోల్ చేశాడని బ్రెజిల్ కీపర్ అలీసన్ వెంటనే ఫిర్యాదు చేశాడు. రిఫరీలు సుదీర్ఘంగా చర్చలు జరిపిన తర్వాత గోల్ చేత్తో చేయలేదని నిర్ధారించడంతో బ్రెజిల్ ఆటగాళ్లు నిర్ఘాంతపోయారు. స్టార్ ఆటగాడు నేమార్ జట్టులో లేకపోవడం కూడా బ్రెజిల్ విజయావకాశాలను దెబ్బతీసింది.

ఆట మొదటి భాగంలో దూకుడు ప్రదర్శించిన బ్రెజిల్ ద్వితీయార్థంలో తేలిపోయింది. ఫస్టాప్ లో రెండు పెరూ గోల్ పోస్టుపై దాడి చేసింది. 1993 నుంచి ప్రతి కోపాలో కనీసం క్వార్టర్ ఫైనల్ చేరిన బ్రెజిల్ ఇప్పుడు లీగ్ దశలోనే నిష్క్రమించింది. 1985 తర్వాత బ్రెజిల్ తో ఆడిన 16 మ్యాచుల్లో 10 డ్రా కాగా, ఆరింటిలో పెరూ ఓడించింది.

మరిన్ని వార్తలు