సాండీ స్టన్నింగ్‌ క్యాచ్‌.. విలియమ్సన్‌ షాక్‌

28 Mar, 2020 18:52 IST|Sakshi

వెల్లింగ్టన్‌: మహమ్మారి కరోనా వైరస్‌(కోవిడ్‌-19) దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలకు పాకింది. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే ఇంటికే పరిమితం కావాలనే ప్రాథమిక సూత్రంతో అనేకమంది సెల్ఫ్‌ ఐసోలేషన్‌(స్వీయ నిర్భంధం) పాటిస్తున్నారు. మెల్లిమెల్లిగా  తమ దేశంలో కూడా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు. అయితే ఈ ఖాళీ సమయంలో తన పెంపుడు కుక్క(సాండీ)తో కలిసి సరదాగా ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో సాండీతో కలిసి క్రికెట్‌ ఆడిన వీడియోను విలియమ్సన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. 

ఆ వీడియోలో విలియమ్సన్‌ తన ఇంటి ఆవరణలో సాండీతో పాటు మరొకరితో క్రికెట్‌ ఆడాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌ చేస్తున్న విలియమ్సన్‌ స్లిప్‌లో ఉన్న సాండీ వైపు ఆడాడు. అయితే స్లిప్‌లో సిద్దంగా ఉన్న సాండీ విలియమ్సన్‌ను ఆశ్చర్యానికి గురి చేస్తూ కళ్లు చెదిరే రీతిలో నోటితో క్యాచ్‌ అందుకుంది.  సాండీ క్యాచ్‌ అందుకున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసి ‘సాండీ స్లిప్‌లో ఉంది. ఇంకా ఎక్కడైన కుక్కలు ఉండే సాండీతో క్రికెట్‌ ఆడొచ్చు’అంటూ విలియమ్సన్‌ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఆరోన్‌ పించ్‌తో పాటు అనేక మంది నెటిజన్లను ఆకట్టుకుంది. అంతేకాకుండా సాండీ క్రికెట్‌ ప్రతిభను ప్రశంసిస్తున్నారు. 

Sandy in the slips! 😀 Any other dogs out there joining Sandy? #caninecordon #daytwoisolation

A post shared by Kane Williamson (@kane_s_w) on

Lockdown yoga session with Sandy 😀 It’s a challenging time, but it’s important we take care of each other by listening to the experts! Stay positive, stay at home and we will get through this 👊 #downwarddog #bekind #stayhome

A post shared by Kane Williamson (@kane_s_w) on

చదవండి:
‘రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్‌ విజ్ఞప్తి’
జొకోవిచ్‌ భారీ విరాళం

మరిన్ని వార్తలు