భారత్‌ మునుపటి స్థితికి చేరుకోవాలి: రోహిత్‌

31 Mar, 2020 11:46 IST|Sakshi

రోహిత్‌ శర్మ రూ.80 లక్షల విరాళం

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయిన భారత్‌ మళ్లీ మునుపటి స్థితికి చేరుకోవాలని హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ ఆకాంక్షించారు. కష్టకాలంలో ఉన్న మన దేశానికి సేవ చేసే బాధ్యత అందరిపైనా ఉందని ట్విటర్‌లో పేర్కొన్నారు. కోవిడ్‌-19 బాధితులను, పేదలను ఆదుకునేందుకు తన వంతుగా రూ.80 లక్షలు విరాళం ఇచ్చినట్టు తెలిపారు. పీఎం కేర్స్‌కు రూ.45 లక్షలు, మహారాష్ట్ర సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.25 లక్షలు, ఫ్రీ ఇండియా స్వచ్ఛంద సంస్థకు, వెల్ఫేర్‌ ఆఫ్‌ స్ట్రే డాగ్స్‌కు రూ. 5 లక్షల చొప్పున రోహిత్‌ సాయం చేశారు.
(‘పీఎం కేర్స్‌’కు విరాళాలివ్వండి)

ఇక భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, అతని భార్య, బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ.. పీఎం–కేర్స్‌ ఫండ్, మహారాష్ట్ర ముఖ్య మంత్రి సహాయనిధి కోసం తామిద్దరం నిధులు అందించనున్నట్లు ప్రకటించారు. అయితే తాము ఎంత మొత్తం విరాళంగా ఇస్తున్నది మాత్రం వారిద్దరు గోప్యంగా ఉంచారు. క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ టెండూల్కర్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ రూ.50 లక్షల చొప్పున పీఎం సహాయనిధికి విరాళాలు ప్రకటించారు.
(చదవండి: విరుష్క జోడీ విరాళం రూ. 3 కోట్లు!)

మరిన్ని వార్తలు