కరోనాపై పోరు: విధుల్లో స్టార్‌ ప్లేయర్‌

26 Mar, 2020 20:58 IST|Sakshi

సిమ్లా: కరోనా పోరులో నేను సైతం అంటూ భారత కబడ్డీ జట్టు సారథి అజయ్‌ ఠాకూర్‌ రంగంలోకి దిగారు. రైడింగ్‌, ట్యాకిల్స్‌తో ప్రత్యర్థి జట్టు పనిపట్టడంతో పాటు.. సారథిగా జట్టును బ్యాలెన్స్‌ చేయడంలో, వారిలో ఆత్మస్థైర్యం నింపడంలో అజయ్‌ ఠాకూర్‌ సిద్దహస్థుడన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక కరోనా లాక్‌డౌన్‌ కారణంగా అన్ని స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌, ప్రాక్టీస్‌ సెషన్స్‌ రద్దయిన విషయం తెలిసిందే.  దీంతో కరోనా పోరాటంలో అజయ్‌ ఠాకూర్‌ తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. 

హిమాచల్‌ ప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ సందర్భంగా బిలాస్‌పూర్‌ డీఎస్పీ అజయ్‌ ఠాకూర్‌ తన బృందంతో కలసి రంగంలోకి దిగారు. బిలాస్‌పూర్‌లోని గల్లీగల్లీని పరిశీలించారు. రోడ్లపైకి వచ్చిన వాహనదారులు, ప్రజలను ఆపి లాకౌడౌన్‌ ఉద్దేశాన్ని వివరించారు. అంతేకాకుండా కరోనా పోరులో భాగంగా తాను నిర్వర్తించిన విధులకు సంబంధించిన వీడియోను అజయ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అంతేకాకుండా కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవాలంటే ప్రజలు స్వచ్చందంగా లాక్‌డౌన్‌లో పాల్గొనాలని, అత్యవసర సమయాల్లో మినహా వీధుల్లోకి రాకూడదని బిలాస్‌పూర్‌ డీఎస్సీ అజయ్‌ ఠాకూర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.   

On duty # अभी भी समय है अपने घर रहे ओर दूसरों क़ो भी बोले आप सब सहयोग करें प्रशासन का । तभी य मुमकिन है

A post shared by AJAY THAKUR (@ajaythakurkabaddi) on

చదవండి:
‘ఊపిరి తిత్తులు ఇలాగే ఉక్కిరిబిక్కిరి అవుతాయి’
తెలంగాణలో ఇద్దరు డాక్టర్లకు కరోనా

మరిన్ని వార్తలు