దొరికినంతా దోచెయ్

23 Nov, 2016 23:44 IST|Sakshi
దొరికినంతా దోచెయ్
 ఆంధ్ర క్రికెట్ సంఘంలో అవినీతి
 ఇష్టారాజ్యంగా నిర్మాణాలు, మరమ్మతులు
 పాలకవర్గంలోని వారికే కాంట్రాక్టులు
 ప్రశ్నించిన జిల్లాలపై వేటు
 
 ఏసీఏ అంటే ఆదర్శ్ క్రికెట్ అసోసియేషన్... ఇదీ ఆంధ్ర క్రికెట్ సంఘం పెద్దలు పదే పదే చెప్పే మాట. కానీ వాస్తవంలో మాత్రం ఇది అవినీతి క్రికెట్ సంఘంగా మారింది. విశాఖపట్నం స్టేడియంలో అవినీతి... మంగళగిరి క్రికెట్ స్టేడియంలో పరిజ్ఞానం లేని నిర్మాణం... మూలపాడు మైదాన నిర్మాణంలో స్వప్రయోజనం... ప్రశ్నించిన సంఘాలపై వేటు... ఇష్టమొచ్చినట్లుగా ఓట్లు... వెరసి అంతా  గుత్తాధిపత్యం. ప్రశ్నించేవాళ్లు లేరనే ధీమా. సొంత మనుషులకు పదవులు, కాంట్రాక్టులు... ఇలా అడ్డగోలుగా ఆంధ్ర క్రికెట్ నిర్వహణ జరుగుతోంది. ఏసీఏలో జరుగుతున్న పరిణామాలపై  సాక్షి స్పోర్‌‌ట్స ప్రతినిధులు అందిస్తున్న ప్రత్యేక కథనం.
 
 మంగళగిరి పరిజ్ఞానం లేని నిర్మాణం
 ఏ క్రికెట్ సంఘానికీ రెండు అంతర్జాతీయ స్టేడియాలు అవసరం లేదు. ఏడాదికి ఒకటో రెండో జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌ల కోసం ఒక్క స్టేడియం చాలు. విశాఖలో ఓ పెద్ద స్టేడియం ఉన్నా... మంగళగిరిలో మరో స్టేడియం నిర్మిస్తున్నారు. ఇది మొదలై ఆరేళ్లరుునా ఇంత వరకూ ఓ కొలిక్కి రాలేదు. ఈ స్టేడియం నిర్మాణంలో ఏ మాత్రం క్రికెట్ పరిజ్ఞానం లేకుండా వ్యవహరించారు. సాధారణంగా ఎక్కడైనా పిచ్ ఉత్తరం, దక్షిణం ఉంటుంది. కాబట్టి పెవిలియన్ అటువైపే నిర్మిస్తారు. కానీ ఇక్కడ తూర్పు, పడమర దిశలో పిచ్ నిర్మాణం ప్లాన్‌తో పెవిలియన్ నిర్మించారు. చెన్నై నుంచి వచ్చిన ఓ బీసీసీఐ అధికారి ఇది చూసి విస్తుపోయి తిట్టారు. 
 
దీంతో వాటిని పడగొట్టి మళ్లీ నిర్మాణం మొదలుపెట్టారు. దీనికోసం సుమారు మూడు కోట్ల రూపాయలు వృథా అయ్యాయి. స్టేడియం నిర్మాణానికి కూడా టెండర్లు లేవు. కావలసిన వారికి ఇచ్చేసుకున్నారు. నిజానికి ఈ స్టేడియం అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహణకు పనికిరాని ప్రమాణాలతో ఉంది. స్టేడియంకు వెళ్లాలంటే రైల్వేగేట్ దాటాలి. అక్కడ భూగర్భజలాలు కూడా బాగా లేవు. దీంతో ఆ ప్రాంతంలో ప్లాట్లు కొనుక్కున్నవాళ్లు ఇళ్లు కట్టుకోవడం లేదు. మైదానం నిర్వహణ కోసం నీటిని కొనాల్సి ఉంటుంది. అయినా ఈ ప్రాంతాన్ని ఎంచుకుని సుదీర్ఘ కాలం నుంచి నిర్మాణం జరుపుతున్నారు. పిచ్ ఉత్తర, దక్షిణంగా ఉండాలనే కనీస పరిజ్ఞానం లేకుండా మైదాన నిర్మాణం మొదలవడం కంటే దారుణం మరొకటి ఉండదు.
 
 ఆటగాళ్ల బదులు మైదానాలపై...
 ఏసీఏకు ఉన్న మైదానాలు దేశంలో మరే సంఘానికి లేవని అందుకే బీసీసీఐ తమని మెచ్చుకుందని పదే పదే చెప్పుకుంటారు. 13 జిల్లాల్లో 18 గ్రౌండ్‌‌స అభివృద్ధి చేశామని చెబుతున్నారు. కానీ మైదానాల కంటే ఆటగాళ్లు ముఖ్యమనే మాట మరచిపోయారు. గతంలో ఆంధ్ర నుంచి ఒక దశలో ఒకేసారి ముగ్గురు భారత అండర్-19 జట్టులో ఆడారు. అండర్-19, అండర్-16 భారత జట్లకు ఆంధ్ర క్రికెటర్లే సారథులుగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు జాతీయ జట్టు దరిదాపుల్లో ఎవరూ లేరు. క్రికెట్ పరిజ్ఙానం లేని పాలకుల చేతుల్లో సంఘం ఉండటం వల్ల ఇలా జరుగుతుందనే విమర్శ ఉంది. 
 
ఎంతసేపూ ఓ కొత్త నిర్మాణం చేపడితే డబ్బులు వస్తాయని తప్పిస్తే... ఆట గురించి ఆలోచన లేదు. ఆటగాళ్ల కోసం ఖర్చుచేసేదీ లేదు. తిరుపతిలోని ఎస్‌వీ యూనివర్శిటీలో మైదానం కట్టేందుకు 50 లక్షలు చెల్లించి ఒప్పందం చేసుకున్నారు. ఆ మైదానంలో ఉన్న టేకు చెట్లను కొట్టేయడంతో గ్రీన్ ట్రిబ్యునల్ ఏసీఏకు 90 లక్షల రూపాయలు జరిమానా వేసింది. దీంతో కోటీ 40 లక్షల రూపాయలు వృథా అయ్యారుు. అవగాహన లేకుండా పనులు చేస్తున్నారనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. 
 
 విశాఖపట్నం   వ్యక్తి సామ్రాజ్యం
 నగరంలో అద్భుతమైన స్టేడియం ఉంది. హుదూద్ తుఫాన్ తర్వాత పాడరుుపోరుున స్టేడియాన్ని బాగు చేసి టెస్టు మ్యాచ్ కూడా నిర్వహించారు. కానీ ఈ స్టేడియంలో జరిగే అవినీతికి అడ్డూ అదుపూ లేదు. ఏసీఏలో ప్రధానమైన పదవిలో ఉన్న వ్యక్తి నియంత్రణలో ఇక్కడ వ్యవహారాలన్నీ జరుగుతాయి. ఆయన మనుషులే అన్ని రకాల కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఏ పనికీ టెండర్ పిలవడం ఉండదు. ఇక్కడ పనులు చేయడం కోసం పనులు ‘సృష్టించుకుంటారు’. 
 
అకస్మాత్తుగా ఓ గోడ పడిపోతుంది. లేదంటే డ్రెస్సింగ్ రూమ్‌లో కార్పెట్ చిరిగిపోతుంది. లేదంటే పై కప్పు పెచ్చు లు ఊడిపోతుంది. వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వాటిని సదరు పెద్ద మనిషికి చెందిన వ్యక్తులు వచ్చి మరమ్మతులు చేసి ‘కావలసినన్ని’ డబ్బులు తీసుకుంటారు. అసలు ప్రతి 15 రోజులకు నెల రోజులకు ఏదో ఒక పని ఎందుకు చేయాల్సి వస్తుందని ఎవరూ ప్రశ్నించడం లేదు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన స్టేడియంలో అకస్మాత్తుగా ఎందుకు కొత్త కొనుగోళ్లు, మరమ్మతులు చేయాల్సి వస్తుందని ఎవరూ ప్రశ్నించడం లేదు. ఎందుకంటే పదవిలో ఉన్న ఆ వ్యక్తికి ఏసీఏలోని పెద్దల ఆశిస్సులు ఉన్నాయి. 
 
 టెస్టు మ్యాచ్‌తో ‘పండగ’
 ఇటీవల టెస్టు హోదా వచ్చిన సందర్భంగా బీసీసీఐ ప్రమాణాల ప్రకారం అంటూ... మీడియా సెంటర్‌ను మార్చారు. గతంలో స్టాండ్‌‌స ఉన్న ప్రాంతంలో చుట్టూ అద్దాలు అమర్చి కొన్ని మార్పులతో దీనిని నిర్మించారు. దీని కోసం కోటీ 20 లక్షల రూపాయల వరకూ ఖర్చరుుందని సమాచారం. 30 లక్షలు  కూడా ఖర్చవ్వని చోట ఇంత భారీ మొత్తం వెచ్చించారనే విమర్శలు ఉన్నాయి. ఇక మ్యాచ్‌ల సందర్భంగా ఏర్పాటు చేసే కమిటీలలో ఆదాయం పుష్కలంగా ఉండే కమిటీలన్నింటిలో సదరు పెద్దమనిషి సభ్యుడు. ఎవరికి కాంట్రాక్ట్ ఇవ్వాలో... ఎంత మొత్తం ఇవ్వాలో ఆయనే నిర్ణయిస్తాడు. ఆహారం, ఆతిథ్యం, రవాణాలాంటి ఖర్చయ్యే అంశాలన్నీ ఆయన మనుషులే చూస్తుంటారు. అన్నీ ‘హోమ్ మేడ్’ బిల్స్ పెట్టేస్తారు. స్టేడియంలో ఏ మ్యాచ్ జరిగినా 150 దాకా వాకీటాకీలు అవసరమవుతాయి. 
 
మ్యాచ్ జరిగినప్పుడు వీటిని అద్దెకు తెచ్చుకుని 20 వేల రూపాయలు చెల్లించేవారు. మహా అరుుతే ఏడాదికి సగటున ఐదు మ్యాచ్‌లు (ఒకవేళ ఐపీఎల్ ఉంటే) జరుగుతాయి. అంటే ఏడాదికి లక్ష రూపాయలు. కానీ సదరు పెద్దమనిషి ఈ వాకీ టాకీల కోసం సుమారు 15 లక్షల రూపాయలు ఖర్చు చేశారని సమాచారం. నిజానికి ఏసీఏలో పదవులన్నీ గౌరవం కోసమే. పదవుల్లో ఉన్నందుకు వారికి డబ్బులు ఇవ్వకూడదు. డీఏ తప్ప ఏమీ ఇవ్వకూడదు. కానీ ఆయన ఏ పని కోసం సమయం వెచ్చించినా రోజుకు మూడు వేల రూపాయలు తీసుకుంటారు. ఈయన సుమారు నెలకు 90 వేల రూపాయలు ఏసీఏ నుంచి తీసుకుంటున్నారు. 
 
మిగిలిన ఆఫీస్ బేరర్లకు లేని చెల్లింపులు ఆయనకు మాత్రమే ఎందుకనేది పెద్ద ప్రశ్న. దీనికి ఎవరూ సమాధానం ఇవ్వరు. తాజాగా స్టేడియం బయట ఉండే షాప్‌లలో ఒక షాప్‌ను సబ్ లీజ్‌కు ఇవ్వడానికి ఆయన అనుమతించారు. 10 వేల రూపాయలకు లీజ్ ఇచ్చి... ఆ షాప్‌ను 25 వేలకు సబ్ లీజ్‌కు ఇవ్వడానికి అనుమతి ఇచ్చారు. ఇలా ఎన్ని షాప్‌లకు అనుమతి ఇచ్చారో తెలియదు. మొత్తం మీద విశాఖ స్టేడియం గంగిగోవులా మారింది. పదే పదే మరమ్మతుల, అవసరం లేని కొనుగోళ్లతో అంతా ఓ పెద్ద మనిషి ఇష్టారాజ్యంగా మారిపోయింది.
 
 పేరేచర్ల, మూలపాడు  స్వప్రయోజనాలు
 ఇక ఏసీఏ గుంటూరు జిల్లా పేరేచర్లలో, కృష్ణా జిల్లా మూలపాడులో మైదానాలు నిర్మించింది. ఈ రెండూ నగరానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్నారుు. అటు గుంటూరు నుంచి పేరేచర్ల, ఇటు విజయవాడ నుంచి మూలపాడు వెళ్లి రోజువారీ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇది చాలా దూరం. అరుునా సరే... స్థలం అక్కడ దొరికిందని సరిపెట్టుకోవచ్చు. పేరేచర్ల మైదానం చుట్లూ స్టోన్ క్రషర్స్ ఉన్నాయి. వీటి నుంచి వచ్చే ఫ్లైయాష్ కళ్లలో పడుతుంది. మూలపాడు మైదానం కూడా కొండల మధ్య ఉంది. అక్కడి క్రషర్‌లలో బ్లాస్టింగ్‌‌స చేస్తే ఆ రాళ్లు వచ్చి మైదానంలో పడతాయి. 
 
ఇలా రాళ్లు పడుతున్నాయని ఏసీఏ పోలీస్‌లకు ఫిర్యాదు చేసింది కూడా. ఈ మైదానంలో ఇటీవల భారత్, వెస్టిండీస్ మహిళల మ్యాచ్‌లు నిర్వహించారు. తద్వారా ఇదో అద్భుత మైదానమని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఈ ప్రాంతంలో ఏసీఏకు చెందిన ఓ పెద్ద మనిషి పొలాలు ఉన్నాయి. చుట్టూ ఉన్న స్థలాల విలువను పెంచడం కోసం ఈ ప్రాంతంలో స్టేడియం నిర్మించారనే విమర్శలు వస్తున్నారుు. ఈ మైదానం దగ్గర కొండల మధ్య 900 ఎకరాల స్థలాన్ని తమకు ఇస్తే టూరిజం అభివృద్ధి చెందేలా నిర్మాణాలు చేస్తామని సదరు పెద్ద మనిషి తాజాగా ఏపీ సీఎంను కోరినట్లు సమాచారం. స్వప్రయోజనాల కోసమే మూలపాడు స్టేడియం నిర్మాణం జరిగిందని విమర్శలు ఉన్నారుు. 
 
 ఎవరూ అడగవద్దు
 ఏసీఏలో జరుగుతున్న అవినీతి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే ఆ సంఘంపై వేటు వేస్తారు. ఇలా ఇప్పటికే చిత్తూరు, గుంటూరు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లా సంఘాలను తొలగించారు. ఆశ్చర్యకరంగా ఆయా జిల్లాల్లో బాయ్స్ అండ్ గర్ల్స్ క్రికెట్ అసోసియేషన్ పేరుతో కొత్త సంఘాలను ఏర్పాటు చేసి వాటికి గుర్తింపు ఇచ్చారు. దీంతో జిల్లా సంఘాలు కోర్టులను ఆశ్రయించాయి.  నిజానికి ఏసీఏను నడిపే వ్యక్తికి డబ్బు అవసరం లేదు. కాకపోతే ఆయన తన పదవి కోసం మిగిలిన వారు చేసే అవినీతిని చూసీ చూడకుండా వదిలేస్తున్నారు. 
 
 ఇష్టారాజ్యంగా ఓట్లు
 ఏ క్రికెట్ సంఘంలో అరుునా ఆ సంఘం పరిధిలో ఉన్న జిల్లాలకు మాత్రమే ఓట్లు ఉండాలి. అయితే జిల్లాల్లో ఉన్న క్లబ్‌లకు కూడా క్రమంగా ఓట్లు ఇచ్చేశారు. ఇది చాలా రాష్ట్రాల్లో జరిగింది. అలా ఏసీఏలో కూడా 13 జిల్లాలు, 16 క్లబ్‌ల ఓట్లు ఉన్నాయి. ఈ 16 క్లబ్‌లు ఎప్పుడూ అధికారంలో ఉన్న వారి చేతిలో ఉంటాయి. ఒకవేళ జిల్లా సంఘాలు అసంతృప్తితో ఉన్నా తమ పదవులు పోకుండా కాపాడుకునేందుకు వీలుగా... ఏసీఏ ఆఫీస్ బేరర్లకు కూడా ఓట్లు ఇచ్చారు. 16 మంది ఆఫీస్ బేరర్ల చేతిలో 16 క్లబ్‌లు ఉంటాయి. కాబట్టి మొత్తం 45 ఓట్లలో 32 ఇటే పడతారుు. ఎన్నికలు జరిగినా సమస్య ఉండు. అరుుతే ఇలా ఆఫీస్ బేరర్లకు ఓట్లు ఇవ్వడం అనేది ఏసీఏలో తప్ప మరెక్కడా లేని విడ్డూరం. 
 
 లోధా ప్రతిపాదనలు అమలు చేయరేం..?
 హైదరాబాద్ క్రికెట్ సంఘం లోధా కమిటీ ప్రతిపాదనలను అమలు చేస్తామంటూ తాజాగా ఏజీఎమ్ పెట్టి ప్రకటించింది. ఈ మేరకు లేఖ రాసింది. కానీ ఏసీఏ మాత్రం ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. సుప్రీంకోర్టు ఆదేశించినా ఇప్పటివరకూ ఏసీఏలో ఉలుకూ పలుకూ లేదు. ఈ సంఘంలో ప్రధాన పదవిలో ఉన్న వ్యక్తి ఓ ప్రముఖ న్యాయవాది. మరి సుప్రీం ఉత్తర్వులను ఆయనే గౌరవించకపోతే ఎలా..?
 
 అమలు చేస్తే...
 లోధా కమిటీ బీసీసీఐతో పాటు రాష్ట్రాలను కూడా ప్రక్షాళన చేసే ప్రయత్నంలో ఉంది. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే ప్రస్తుతం ఉన్న ఆఫీస్ బేరర్లంతా తప్పుకోవాల్సి వస్తుంది. క్లబ్‌ల ఓట్లు కూడా పోతాయి. అప్పుడు జిల్లాల అధికారం పెరుగుతుంది. కాబట్టి ఈ ప్రతిపాదనల అమలు జరిగే లోపే అన్ని జిల్లాలను తమ చేతుల్లో ఉంచుకునే ప్రక్రియలో భాగమే పాత సంఘాలను తొలగించి కొత్త వారికి గుర్తింపు ఇవ్వడం. అలాగే తాము తప్పుకుని తమ వారసులను తెరమీదకు తెస్తున్నారు. లోధా ప్రతిపాదనలు పూర్తి స్థారుులో అమలైతే ఈ ఆటలు సాగే అవకాశాలు తక్కువ.  
 
మరిన్ని వార్తలు