కానుకలుగా కార్లు, బంగారం

28 Oct, 2016 00:49 IST|Sakshi
కానుకలుగా కార్లు, బంగారం

క్రికెట్ సంఘాల అవినీతి భాగోతం
లోధా కమిటీ విచారించే అవకాశం! 


ముంబై: ఒక అసోసియేషన్ తమ కార్యవర్గ సభ్యులందరికీ కార్లు కొనిచ్చి డీజిల్ ఖర్చులకు కూడా డబ్బులిస్తే... మరో సంఘంలోనైతే సభ్యులు తమ భార్యల కోసం బంగారు ఆభరణాలు కానుకలుగా అందుకున్నారు! ఇప్పుడు ఈ భాగోతాలన్నీ బయటపడే అవకాశాలు ఉన్నారుు. మార్చి 31 వరకు వివిధ రాష్ట్ర సంఘాల అకౌంట్లకు సంబంధించి ఆడిట్ రిపోర్ట్‌లు ఇవ్వాల్సిందిగా లోధా కమిటీ కోరే అవకాశం ఉందని బీసీసీఐ ఆందోళన చెందుతోంది. ఇదే జరిగితే సుప్రీం కోర్టు మరో విచారణకు ఆదేశించే అవకాశం కూడా ఉందని బోర్డులోని సీనియర్లు చెబుతున్నారు. ‘కొన్ని రాష్ట్ర సంఘాల ఆర్థిక వ్యవహారాల నిర్వహణ మరీ ఘోరంగా ఉంది’ అని ఒక అధికారి అభిప్రాయ పడ్డారు. ప్రస్తుతం ఆడిట్ రిపోర్ట్‌లు బీసీసీఐ న్యాయ నిపుణులు అమర్ చంద్ మంగళ్‌దాస్ వద్ద ఉన్నారుు. గోవా క్రికెట్ సంఘం తమ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు 18 మందికి వ్యక్తిగత అవసరాల కోసం కార్లను కొని ఇచ్చింది. అంతే కాకుండా వాటి నిర్వహణ కోసం పెట్రోల్, డీజిల్ ఇచ్చినట్లుగా కూడా అకౌంట్లలో చూపించింది.

అదే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) టెండర్ల ప్రక్రియ సందర్భంగా ఈసీ సభ్యులు బంగారు నాణెంతో పాటు తమ భార్యల కోసం బంగారు ఆభరణాలను కూడా బహుమతులుగా తీసుకున్నారు. పైగా కోట్ల రూపాయలకు సరైన లెక్కలే లేవు. కేరళ క్రికెట్ సంఘం అవసరం లేకపోరుునా రూ. 30 కోట్ల విలువైన భూమి కొని నిధులు వృథా చేయగా, చిన్న సంఘాలే అరుునా అస్సాం, ఒడిశా, జమ్ము కశ్మీర్‌లు కూడా తీవ్ర అవినీతికి పాల్పడ్డారుు. ఇప్పుడు లోధా కమిటీ విచారిస్తే మరిన్ని ఆశ్చర్యకర అంశాలు వెలుగులోకి రావచ్చు.

మరిన్ని వార్తలు