ఆసీస్ జట్టు కన్సల్టెంట్‌గా శ్రీరామ్

16 Dec, 2015 23:53 IST|Sakshi
ఆసీస్ జట్టు కన్సల్టెంట్‌గా శ్రీరామ్

మెల్‌బోర్న్: వచ్చే ఏడాది జరగనున్న టి20 ప్రపంచకప్ నేపథ్యంలో భారత మాజీ ఆటగాడు శ్రీధరన్ శ్రీరామ్, మైక్‌హస్సీలను ఆస్ట్రేలియా జట్టు కన్సల్టెంట్స్‌గా నియమించుకుంది. టోర్నీ ఆరంభ దశలో శ్రీరామ్.. ఆసీస్ జట్టు సన్నాహాకాలను పర్యవేక్షిస్తాడు. అయితే దక్షిణాఫ్రికాతో జరిగే మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌తోనే శ్రీరామ్ బాధ్యతలు చేపడతాడని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వెల్లడించింది. ‘భారత్‌కు వచ్చే ముందు మేం ప్రొటీస్‌తో సిరీస్ ఆడతాం. ఈ సిరీస్‌లో మా ఆటగాళ్ల ప్రదర్శనపై శ్రీరామ్ దృష్టిపెడతాడు.
 
  అలాగే భారత్‌లో ఎదురయ్యే పరిస్థితులపై క్రికెటర్లకు శిక్షణ ఇస్తాడు. హస్సీకి టి20లతో పాటు ఐపీఎల్‌లోనూ చాలా అనుభవం ఉంది. కాబట్టి అతని సేవలను కూడా వినియోగించుకుంటాం’ అని సీఏ పేర్కొంది. ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డేవిల్స్‌కు సహాయక కోచ్‌గా వ్యవహరించిన శ్రీరామ్... భారత్ తరఫున 2000-04 మధ్య ఎనిమిది వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు