మైదానంలో అభిమాని అత్యుత్సాహం

4 Oct, 2019 14:32 IST|Sakshi

విశాఖ: భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో ఒక అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. మూడో రోజు ఆట జరుగుతున్న సమయంలో మైదానంలోకి పరుగులు తీశాడు. అదే సమయంలో క్రికెటర్లతో సెల్ఫీలు దిగేందుకు యత్నించాడు. దీన్ని సిబ్బందికి అడ్డుకోవడానికి యత్నించడంతో పరుగులు తీశాడు. చివరకు ఆ యువకుడ్ని సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతన్ని పోలీసులకు అప్పగించారు. 

ఈ మ్యాచ్‌లో భారత్‌ సాధించిన స్కోరుకు దక్షిణాఫ్రికా దీటుగా బదులిస్తోంది. ఓపెనర్‌ డీన్‌ ఎల్గర్‌ శతకం సాధించగా, డుప్లెసిస్‌(55) హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. వీరిద్దరూ 115 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి స్కోరును గాడిలో పెట్టారు. 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో ఎల్గర్‌-డుప్లెసిస్‌ జోడి మరమ్మత్తు చేపట్టింది. కాగా, జట్టు స్కోరు 178 పరుగుల వద్ద డుప్లెసిస్‌ ఐదో వికెట్‌గా ఔటైన తర్వాత ఎల్గర్‌కు డీకాక్‌ జత కలిశాడు. డీకాక్‌ సైతం ఎల్గర్‌కు చక్కటి సహకారం​ అందించడంతో సఫారీలు తేరుకున్నారు. డీకాక్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

స్మార్ట్‌ వాచ్‌లపై నిషేధం

సచిన్‌కు మోదం.. టీమిండియాకు ఖేదం

కోహ్లి, గుండు కొట్టించుకో: వార్న‌ర్‌

లాక్‌డౌన్‌: వీరంతా ఏం చేస్తున్నారో చూశారా?

రూ. 1.25 కోట్లు : సానియా మీర్జా

సినిమా

భార్య, పిల్లలు విదేశాల్లో చిక్కుకుపోయారు: విష్ణు

ఈ పాటను చేతులు కడుక్కొని వినండి!

ఇంటి ప‌ని చేస్తూ ఏడ్చేసిన‌ న‌టి

‘దారుణం, అత‌డి ప్ర‌తిభ‌ను కొట్టేశారు’

న‌యా ట్రెండ్ సృష్టిస్తోన్న ‘ఆహా’

సింగ‌ర్‌కు ఐదోసారీ క‌రోనా పాజిటివ్‌