కపిల్‌దేవ్‌కు అరుదైన గౌరవం

14 Sep, 2019 20:01 IST|Sakshi

చండీగఢ్‌: టీమిండియాకు తొలి ప్రపంచకప్‌ అందించిన సారథి, క్రికెట్‌ లెజెండ్‌ కపిల్‌దేవ్‌కు అరుదైన గౌరవం దక్కింది. హరియాణా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ తొలి ఛాన్స్‌లర్‌గా కపిల్‌దేవ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు హరియాణా క్రీడా శాఖ మంత్రి అనిల్‌ విజ్‌ అధికారికంగా ప్రకటించారు. ఇటీవలే హరియాణ స్పోర్ట్‌ యూనివర్సిటీకి అక్కడ కేబినెట్‌ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో స్పోర్ట్స్‌ యూనివర్సిటీని నెలకొల్పిన మూడో రాష్ట్రంగా హరియాణా నిలిచింది. ఇప్పటివరకు గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాలు మాత్రమే క్రీడా విశ్వవిద్యాలయాలను ఏర్పాటుచేశాయి. 

కపిల్‌దేవ్‌ సారథ్యంలో టీమిండియా ప్రపంచకప్‌ గెలిచింది.. అతడి మార్గదర్శకంలో ఈ విశ్వవిద్యాలయం అభివృద్ది చెందాలని తాము భావిస్తున్నట్లు మంత్రి అనిల్‌ విజ్‌ పేర్కొన్నారు. ఇప్పటికే యునివర్సిటీలో చేర్చాల్సిన కోర్సులు, సిలబస్‌, విధివిధానాలను రూపొందించినట్లు తెలిపారు. గ్రామస్థాయి నుంచి క్రీడలను అభివృద్ది చేస్తున్నామని, ఈ యూనివర్సిటీలో అందిస్తున్న సౌకర్యాలతో హరియాణా క్రీడా రాష్ట్రంగా రూపుదిద్దుకోవాలని మంత్రి అనిల్‌ విజ్‌ ఆకాంక్షించారు. 
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రోహిత్‌కు చిర్రెత్తుకొచ్చిన వేళ..

రెండేళ్ల వేతనాన్ని విరాళంగా ఇచ్చిన గంభీర్‌

‘ట్రంప్‌లాగే ఆలోచించవద్దు.. ప్రాణాలే ముఖ్యం’

వేలానికి బట్లర్‌ ప్రపంచకప్‌ జెర్సీ

హాకీ ఇండియా, ఏఐఎఫ్‌ఎఫ్‌ విరాళం రూ. 25 లక్షలు

సినిమా

పవన్‌ కల్యాణ్‌ను నిలబెట్టిన చిత్రం..

కూతురి శ్ర‌ద్ధాంజ‌లి.. ఓ తండ్రి ఆవేద‌న‌

‘బాహుబలి’ని బ్రేక్‌ చేసిన మహేశ్‌ చిత్రం

ఆ బికినీ ఫొటోకు అంత ఎడిటింగ్ ఎందుకు?

చేదు అనుభవాలు ఎదుర్కొంటున్నా: హీరోయిన్‌

వైర‌ల్ అవుతున్న క‌రోనా సాంగ్‌