రోడ్డు సేఫ్టీపై క్రికెట్‌ మ్యాచ్‌

21 Mar, 2018 19:31 IST|Sakshi
సునీల్‌ గవాస్కర్‌

ముంబై : రోడ్డు ప్రమాదలపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు భారత క్రికెటర్లు నడుం బిగించారు. కిక్రెట్‌ ను అమితంగా ప్రేమించే దేశంలో ప్రజలకు క్రికెట్‌ ద్వారానే మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో పలువురు క్రికెటర్లు ముందుకొచ్చారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంచేలా.. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ నెల 24న క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహిస్తున్నట్టు టీమిండియా మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ తెలిపారు. ఈ మ్యాచ్‌లో యువరాజ్‌ సింగ్‌, దినేశ్‌ కార్తీక్‌, శిఖర్‌ ధావన్‌, అంజిక్యా రహానేలతో పాటు పలువురు దేశవాళీ కిక్రెటర్లు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికే క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ రోడ్డు ప్రమాదాలపై ప్రజలు అ‍ప్రమత్తంగా ఉండాలని సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. రాజ్యసభ సభ్యుడిగా నకిలీ హెల్మెట్‌లు తయారు చేస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి సచిన్‌ లేఖ కూడా రాశారు.

ఇక దేశంలో రోడ్డు ప్రమాదాల వలన ఎక్కవ మంది చనిపోతున్నారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించకపోవడంవల్లే ఎక్కవగా ప్రమాదాలు జరుగుతున్నాయని పలు సర్వేల్లో వెల్లడైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రజలకు అవగాహన కలిగించేందుకు క్రికెటర్లు ముందుకొచ్చారు. 

మరిన్ని వార్తలు