అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు: గంభీర్‌

14 Feb, 2020 14:40 IST|Sakshi

అమ్మాయిలూ మీరు కూడా మారండి

న్యూఢిల్లీ:  క్రమేపీ క్రికెట్‌ గేమ్‌ ఎంతో మారిపోయిందని టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ పేర్కొన్నాడు. ఒకప్పుడు క్రికెట్‌ అనేది టెక్నికల్‌ గేమ్‌గా ఉంటే, అది కాస్తా ఫిజికల్‌ గేమ్‌గా మారిపోయిందన్నాడు. టీ20 క్రికెట్‌ రాకముందు వరకూ క్రికెట్‌ అనేది ఆటగాళ్ల సాంకేతికతపై ఆధారపడి ఉండేదని, ఈ ఫార్మాట్‌ వచ్చిన తర్వాత ఫిట్‌నెస్‌ అంశంపై చాలా కీలకంగా మారిపోయిందన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో సరైన ఫిట్‌నెస్‌ లేకపోతే ఏ ఫార్మాట్‌లోనైనా రాణించడం సాధ్యం కాదన్నాడు.  ప్రస్తుత టీమిండియా క్రికెటర్లు ఫిట్‌నెస్‌ పరంగా చాలా ముందంజలో ఉన్నారన్నాడు. గత ఆటగాళ్లతో పోలిస్తే ఇప్పుడు టీమిండియా క్రికెటర్ల ఫిట్‌నెస్‌ స్థాయి మరో లెవల్‌ ఉందన్నాడు. ఇక మహిళా క్రికెటర్లు కూడా పురుష క్రికెటర్లను ఆదర్శంగా తీసుకోవాలన్నాడు. ప్రధానంగా ఫిట్‌నెస్‌పై మహిళా క్రికెటర్లు దృష్టి పెట్టాలన్నాడు. 

‘ఇప్పుడున్న క్రికెటర్లను చూడండి. ఫిజికల్‌గా చాలా ఫిట్‌గా ఉంటున్నారు. ఒకప్పటి క్రికెటర్లతో పోలిస్తే ఇప్పుడు క్రికెటర్లు ఫిట్‌నెస్‌లో ఎంతో పరిణితి సాధించారు. గతంలో ఫిజికల్‌ ఫిట్‌నెస్‌కు అంత ప్రాముఖ్యత ఉండేది కాదు. టీ20 ఫార్మాట్‌ రూపాంతరం చెందిన తర్వాత క్రికెట్‌ అనేది పూర్తిగా మారిపోయింది. క్రికెట్‌ అనేది ఫిజికల్‌ గేమ్‌ అయిపోయింది. నేను క్రికెట్‌ను ఆరంభించేటప్పటికీ టీ20 ఫార్మాట్‌ లేదు. అప్పుడు కేవలం టెక్నికల్‌ స్పోర్ట్‌గానే క్రికెట్‌ ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. నువ్వు ఫిజికల్‌ ఫిట్‌గా లేవంటే ఏ ఫార్మాట్‌లోనూ ఆశించిన ఫలితాలు సాధించలేదనేది నా అభిప్రాయం’ అని గంభీర్‌ పేర్కొన్నాడు.

,

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా