తొందర పడొద్దు.. రనౌట్‌ కావొద్దు..!

27 Mar, 2020 16:54 IST|Sakshi

న్యూఢిల్లీ:  కరోనా వైరస్‌ విజృంభణ కారణంగా గత రెండు రోజుల క్రితం భారతదేశ మొత్తాన్ని లాక్‌డౌన్‌ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో దాదాపు ప్రజలంతా ఇళ్లకే పరిమితం అవడానికే యత్నిస్తున్నారు. కాకపోతే కొన్ని సందర్భాల్లో బయటకొచ్చే క్రమంలో ప్రజలు గుంపులుగా రావడం మాత్రం కలవరపరుస్తోంది. ఎవరైనా  కూరగాయాలు లాంటి నిత్యావసరాలు తీసుకోవడానికి వెళ్లే క్రమంలో లాక్‌డౌన్‌ నియమాన్ని అతిక్రమిస్తున్నారు. ఈ విషయంపైనే పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.(‘కరోనాపై పోరాటంలో గెలుస్తాం’)

దీనిపై క్రికెటర్లు తమదైన శైలిలో ప్రజల్ని బయటకు రావొద్దని సోషల్‌ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. లాక్‌డౌన్‌ నియమాన్ని అతిక్రమిస్తే ఎలా ఉంటుందో భారత క్రికెటర్లు రవి చంద్రన్‌ అశ్విన్‌,  రవీంద్ర జడేజాలు తమ పోస్టుల ద్వారా తెలియజెప్పారు. గతేడాది ఐపీఎల్‌ సందర్భంగా జోస్‌ బట్లర్‌ను మన్కడింగ్‌ చేసిన ఫొటోను అశ్విన్‌ ట్వీట్‌ చేయగా, ఆసీస్‌ క్రికెటర్‌ ఉస్మాన్‌ ఖవాజాను రనౌట్‌ చేసిన వీడియోను జడేజా పోస్ట్‌ చేశాడు. తొందరపడితే ఇలానే ఉంటుందనే విషయం ప్రజలు తెలుసుకోవాలనేది వీరి రనౌట్‌ పోస్టులు ఉద్దేశం. 

‘జోస్‌ బట్లర్‌ను మన్కడింగ్‌ చేసిన ఫోటోను నాకు ఎవరో పంపారు. అదే సమయంలో ఇది జరిగి ఏడాది అయిందనే విషయాన్ని కూడా గుర్తు చేశారు. దేశంలో లాక్‌డౌన్‌ నడుస్తున్న సమయం. బట్లర్‌ను నేను ఔట్‌ చేసింది నా దేశ ప్రజలకు బాగా గుర్తు. ఎవరూ బయటకు వెళ్లొద్దు. ఇంట్లోనే ఉండండి.. సేఫ్‌గా ఉండండి’ అని అశ్విన్‌ ట్వీట్‌ చేశాడు.  ‘ స్టే ఎట్‌ హోమ్‌.. స్టే సేఫ్‌.. అనవసరంగా రనౌట్‌ కావొద్దు’ అని జడేజా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. 

Stay safe, stay at home. Runout matt hona. ❌ 🎥- @foxcricket @cricketcomau

A post shared by Ravindra Jadeja (@royalnavghan) on

>
మరిన్ని వార్తలు