‘బాయ్‌’పై ప్రణయ్,  సాయిప్రణీత్‌ ధ్వజం 

23 Apr, 2019 01:22 IST|Sakshi

ఆసియా చాంపియన్‌షిప్‌కు ఎంట్రీలు పంపకపోవడంపై విమర్శ

న్యూఢిల్లీ: ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ (ఏబీసీ)కు తమ పేర్లను ప్రతిపాదించకపోవడంపై భారత షట్లర్లు హెచ్‌ఎస్‌ ప్రణయ్, భమిడిపాటి సాయిప్రణీత్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయంలో భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) అధికార వర్గాలపై వారు విమర్శల దాడికి దిగారు. చైనా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నీ మంగళవారం నుంచి జరుగనుంది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, సమీర్‌ వర్మ భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు.

మలేసియా, ఇండోనేసియా నుంచి తమకంటే తక్కువ ర్యాంకు ఆటగాళ్లు టోర్నీ బరిలో దిగుతుండగా... ‘బాయ్‌’ ఉదాసీనత కారణంగా తా ను, సాయిప్రణీత్‌ అవకాశం కోల్పోయినట్లు ప్రణయ్‌ విమర్శించాడు. దీనిపై ‘బాయ్‌’ స్పందన మాత్రం వేరుగా ఉంది. బ్యాడ్మింటన్‌ ఆసియా (బీఏ) కోరిన మేరకు తాజా ర్యాంక్‌ల ప్రకారం పురుషుల, మహి ళల సింగిల్స్‌లో ఇద్దరేసి ఆటగాళ్లను ప్రతిపాదించా మని ‘బాయ్‌’ చెబుతోంది. మరోవైపు పలు టోర్నీలకు ఆటగాళ్ల ఎంట్రీలను పంపడంలో, వారి ప్రయా ణ వ్యవహారాలను పర్యవేక్షించడంలో ‘బాయ్‌’ తీరు ఘోరంగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. 

మరిన్ని వార్తలు