ఐపీఎల్‌: పంజాబ్‌ గెలిచేనా?

20 May, 2018 20:05 IST|Sakshi
టాస్‌ వేస్తున్న ధోని

చెన్నై సూపర్‌కింగ్స్‌తో కీలక పోరు

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ధోని సేన

పుణే : ఐపీఎల్‌-11 సీజన్‌ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌కు మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఎంసీఏ) స్టేడియం వేదికైంది. కింగ్స్‌ పంజాబ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఇరు జట్లలో మార్పులు చోటుచేసుకున్నాయి. యువరాజ్‌ సింగ్‌, స్టోయినిస్‌ స్థానాల్లో కరుణ్‌ నాయర్‌, డెవిడ్‌ మిల్లర్‌లు పంజాబ్‌ జట్టులోకి రాగా.. చెన్నై జట్టులోకి షేన్‌ వాట్సన్‌ స్థానంలో డుప్లెసిస్‌ తుది జట్టులోకి వచ్చాడు. 

చావోరేవో మ్యాచ్‌..
ఈ మ్యాచ్‌ పంజాబ్‌కు అత్యంత కీలకం. ప్లే ఆఫ్‌ రేసులోనిలవాలంటే గెలవడమే కాకుండా మెరుగైన రన్‌రేట్‌ సాధించాలి. గత ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కడవరకు కేఎల్‌ రాహుల్‌ పోరాడిన పంజాబ్‌ జట్టు ఓటమి పాలైంది. మరోసారి  క్రిస్‌ గేల్‌, కేఎల్‌ రాహుల్‌, కరుణ్‌ నాయర్‌లు బ్యాట్‌ ఝులిపిస్తేనే పంజాబ్‌ గట్టెక్కనుంది. ఇక ఇప్పటికే ప్లే ఆఫ్‌ చేరిన చెన్నై పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కోసం బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్‌లో ఢిల్లీపై అనుహ్యంగా ఓడిన చెన్నై ఈ మ్యాచ్‌లో తిరిగి విజయాన్నందుకోవాలని భావిస్తోంది.

మరిన్ని వార్తలు