‘హ్యాట్రిక్‌’ కోసం సన్‌రైజర్స్‌.. ప్లే ఆఫ్‌ లక్ష్యంగా చెన్నై

23 Apr, 2019 19:39 IST|Sakshi

చెన్నై: ఐపీఎల్‌లో భాగంగా స్థానిక చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడుతోంది. ఇప్పటివరకూ చెన్నై పది మ్యాచ్‌లు ఆడ ఏడింట విజయం సాధించగా, సన్‌రైజర్స్‌ తొమ్మిది మ్యాచ్‌లు ఆడి ఐదు విజయాలు నమోదు చేసింది. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌  ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. దాంతో ప్రతీకారం తీర్చుకోవాలని చెన్నై భావిస్తుండగా, చెన్నైకు మరోసారి షాక్‌ ఇవ్వాలని సన్‌రైజర్స్‌ ఉవ్విళ్లూరుతోంది.  ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ తొలుత ఫీల్డింగ్‌ తీసుకుంది. చెన్నైతో మ్యాచ్‌కు సన్‌రైజర్స్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ దూరమయ్యాడు. వ్యక్తిగత పనిమీద స్వదేశానికి వెళ్లడంతో అతని స్థానంలో భువనేశ్వర్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
(ఇక్కడ చదవండి: స్వదేశానికి విలియమ్సన్‌)

కాగా, వరుసగా రెండు విజయాలతో గెలుపు బాట పట్టిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌... వరుసగా రెండు అనూహ్య పరాజయాలను చెన్నై ఎదుర్కొంది. హ్యాట్రిక్‌ గెలుపుపై సన్‌రైజర్స్‌ కన్నేయగా... ప్లే ఆఫ్స్‌కు చేరేందుకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ సిద్ధమైంది. ఈ రెండు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలో దిగనున్నాయి.  సన్‌ రైజర్స్‌ వెన్నెముక ఓపెనర్లే. వార్నర్, బెయిర్‌ స్టో అసాధారణ ఫామ్‌తో అద్భుత భాగస్వామ్యాలు నెలకొల్పుతూ జట్టును గెలిపిస్తున్నారు. వీరిద్దరూ ఈ సీజన్‌లో నాలుగోసారి శతక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గెలుపు బాట పట్టించారు. కానీ  చెన్నైతో మ్యాచ్‌ అనంతరం రైజర్స్‌ ఆడే తదుపరి మ్యాచ్‌కు జానీ బెయిర్‌స్టో అందుబాటులో ఉండడు. ఇంగ్లండ్‌ ప్రపంచకప్‌ జట్టు సభ్యుడైన బెయిర్‌స్టో మెగా టోర్నీకి సన్నద్ధమయ్యేందుకు తమ దేశానికి పయనమవ్వనున్నాడు.

గతేడాది చెన్నై సూపర్‌ కింగ్స్‌ టైటిల్‌ గెలుపొందడంలో కీలకంగా వ్యవహరించిన టాపార్డర్‌ ఈసీజన్‌లో ఆ జట్టుకు భారంగా మారింది. వాట్సన్‌ , అంబటి రాయుడు, సురేశ్‌ రైనా ఇప్పటివరకు గుర్తుంచుకోదగిన ఇన్నింగ్స్‌ ఆడలేదు. టాపార్డర్‌ వైఫల్యంతో మిడిలార్డర్‌ పని కష్టమవుతోంది. చివర్లో ఒత్తిడంతా కెప్టెన్‌ ధోని పైనే పడుతోంది. మరొకవైపు సొంతమైదానంలో చెన్నైకు తిరుగులేని రికార్డు ఉంది. ఆ జట్టును చెపాక్‌లో నిలువరించాలంటే సన్‌రైజర్స్‌ తీవ‍్రంగా శ్రమించక తప్పదు. చెపాక్‌ పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది.

Liveblog

మరిన్ని వార్తలు