ఆ సంగతి మర్చిపోయాను: కోహ్లి

16 Nov, 2016 13:06 IST|Sakshi
ఆ సంగతి మర్చిపోయాను: కోహ్లి

విశాఖపట్నం: పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని టీమిండియా టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ప్రశంసించాడు. భారత రాజకీయ చరిత్రలోనే ఇది గొప్ప ముందడుగు అని పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌ తో రెండో టెస్ట్‌ మ్యాచ్‌ ఆడేందుకు వైజాగ్ వచ్చిన కోహ్లి బుధవారం మీడియాతో మాట్లాడాడు.

‘నా వరకు ఇది గొప్ప నిర్ణయం. దేశ రాజకీయ చరిత్రలో ఇంత గొప్ప నిర్ణయం ఇప్పటివరకు చూడలేదు. పెద్ద నోట్లను రద్దు చేయడం నన్నెంతోగానే ఆకట్టుకుంది. ఇదంతా నమ్మలేకుండా ఉన్నామ’ని 28 ఏళ్ల కోహ్లి అన్నాడు.

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో చోటుచేసుకున్న సరదా సన్నివేశాన్ని మీడియాతో పంచుకున్నాడు. ​‘రాజ్‌ కోట్‌ లో హోటల్‌ బిల్లు చెల్లించడానికి పాత పెద్ద నోట్లు ఇచ్చాను. అవి చెల్లవన్న విషయం మర్చిపోయాను. వీటిని తిరిగిచ్చేయడంతో నోట్లపై సంతకం చేయాలని అభిమానులు అడుగుతున్నారేమో అనుకున్నాను. తర్వాత పెద్ద నోట్ల రద్దు విషయం గుర్తుకువచ్చింద’ని కోహ్లి తెలిపాడు. భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య రెండో టెస్ట్‌ మ్యాచ్‌ గురువారం నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్‌ చేశారు.

మరిన్ని వార్తలు