‘అతని బౌలింగ్‌ అంటే ఎంతో ఇష్టం’

19 Apr, 2020 10:19 IST|Sakshi

కేప్‌టౌన్‌: భారత క్రికెట్‌ జట్టు మాజీ పేసర్‌ జవగల్‌ శ్రీనాథ్‌కు తగినంత గుర్తింపు లభించలేదని దక్షిణాఫ్రికా మాజీ బౌలర్‌ షాన్‌ పొల్లాక్‌ పేర్కొన్నాడు. 1990-2000ల మధ్యలో భారత్‌కు శ్రీనాథ్‌ ప్రధాన బౌలింగ్‌ ఆయుధని పొల్లాక్‌ తెలిపాడు. కానీ అతని ప్రతిభకు తగ్గ గుర్తింపు రాలేదని పొల్లాక్‌ అన్నాడు. 1991 నుంచి 2003 వరకూ భారత జట్టు తరఫున శ్రీనాథ్ 67 టెస్టులు, 229 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 236, వన్డేల్లో 315 వికెట్లు తీశారు. ('ఆ మ్యాచ్‌లో మియాందాద్ వాడిన బ్యాట్ నాదే')

వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌరల్ మైఖేల్ హోల్డింగ్, ఇంగ్లండ్ బౌలర్ సువర్ట్ బ్రాడ్‌తో కలిసి ఓ చర్చలో పాల్గొన్న పొల్లాక్ .. ‘శ్రీనాథ్‌కు తగినంత గుర్తింపు లభించలేదు. మా కాలంలో చాలా మంచి బౌలర్లు ఉన్నారు. పాకిస్థాన్‌లో వసీం అక్రమ్, వకార్ యూనిస్.. వెస్టిండీస్‌లో కల్ట్రీ ఆంబ్రోస్, వాల్ష్, ఆస్ట్రేలియాలో గ్లెన్ మెక్‌గ్రాత్, బ్రెట్‌ లీ.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎంతో మంది గొప్ప బౌలర్లు ఉన్నారు’’ అని అన్నారు.తన రిటైర్‌మెంట్ తర్వాత సౌతాఫ్రికా బౌలర్లలో డెయిల్ స్టెయిన్ బౌలింగ్‌ తనకు ఎంతో నచ్చిందని పొల్లాక్ పేర్కొన్నారు. ఎటువంటి వికెట్‌పై అయినా స్టెయిన్‌కి బౌలింగ్ చేసే సత్తా ఉందని చెప్పిన పొల్లాక్.. అతను ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి అని.. అతని రికార్డులే అందుకు సాక్ష్యమని పేర్కొన్నారు. (ఐపీఎల్‌ జరిగేలా లేదు )

మరిన్ని వార్తలు