నా ఇంజినే ఎందుకు ఫెయిలైంది?

2 Oct, 2016 15:52 IST|Sakshi
నా ఇంజినే ఎందుకు ఫెయిలైంది?

సెపంగ్: 'మెర్సిడెస్ కు ఇదే  నా ప్రశ్న. డ్రైవర్ల కోసం చాలా ఇంజన్లు తయారు చేశాం. కానీ ఈ సంవత్సరం నా ఇంజినే ఎందుకు ఫెయిలైంది.  నేను డ్రైవర్స్ చాంపియన్ షిష్ రేసులో ఉన్నాను. ప్రస్తుతం చోటు చేసుకున్న ఘటన ఎంతమాత్రం ఆమోద యోగ్యం కాదు.
కేవలం నా ఇంజిన్లు మాత్రమే ఎందుకు చెడిపోతున్నాయి. ఈ ప్రశ్నకు నాకు సమాధానం దొరకాలి. అప్పటివరకూ నాకు నిద్రపట్టదు' అని  ప్రపంచచాంపియన్ హామిల్టన్ అసహనం వ్యక్తం చేశాడు.

ఆదివారం జరిగిన మలేషియా గ్రాండ్ ప్రి ప్రధాన రేసులో మెర్సిడెస్ కు చెందిన హామిల్టన్ కారు ఇంజన్లో మంటలు వ్యాపించాయి. దాంతో అప్పటివరకూ ఆధిక్యంలో ఉన్న హామిల్టన్ పోరును అర్ధాంతరంగా ముగించాడు. 56 ల్యాప్ల రేసులో భాగంగా హామిల్టన్ 40 వ ల్యాప్ లో ఉండగా కారు ఇంజన్ లో ఆకస్మికంగా పొగ వ్యాపించింది. ఆ తరువాత ఒక ల్యాప్ ను కొనసాగించిన తరువాత మంటలు రావడంతో హామిల్టన్ పోరు నుంచి రిటైర్డ్ అయ్యాడు. దీన్ని అనుకూలంగా మార్చుకున్న రెడ్ బుల్ డ్రైవర్ డేనియల్ రికియార్డో విజేతగా నిలిచి మలేషియా గ్రాండ్ ప్రిని సాధించాడు.  మరో రెడ్ బుల్ డ్రైవర్  మ్యాక్స్ వెర్స్టాపెన్ రెండో స్థానంలో నిలిచాడు. గత సింగపూర్ గ్రాండ్‌ప్రి రేసులో విజేతగా నిలిచిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్ బర్గ్ కు మూడో స్థానం దక్కింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు