అర్జున్‌ను ఎదుర్కొవడం కష్టం: డానియల్‌

17 Jun, 2020 09:09 IST|Sakshi

లండన్‌: యువ క్రికెటర్‌ అర్జున్‌ టెండూల్కర్‌ బౌలింగ్‌ను ఎదుర్కొవడం చాలా కష్టమని ఇంగ్లండ్‌ మహిళల క్రికెటర్‌ డానియల్‌ వ్యాట్‌ పేర్కొన్నారు. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ వారసుడునై అర్జున్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగే​ట్రం కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఏడాదిలో ఎక్కువ నెలలు ఇంగ్లండ్‌లో గడుపుతూ ఆటలో నిష్ణాతుడు కావడానికి ప్రయత్నిస్తున్నాడు. దీంతో ఆదేశ క్రికెటర్లతో నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తూ మెరుగవుతున్నాడు. అంతేకాకుండా ఇంగ్లండ్‌ మహిళల క్రికెట్‌ జట్టుతోనూ అర్జున్‌ ప్రాక్టీస్‌ చేసిన సందర్బాలు కూడా ఉన్నాయి.  ఇక ఇంగ్లండ్‌ మహిళల క్రికెట్‌ జట్టు స్టార్‌ బ్యాట్స్‌వుమన్‌ డానియల్‌ వ్యాట్‌, అర్జున టెండూల్కర్‌లు మంచి స్నేహితులు అనే విషయం అందిరికీ తెలిసిందే. అయితే అర్జున్‌ బౌలింగ్‌ గురించి వ్యాట్‌​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ('తండ్రిగా నా కోరికలు నెరవేర్చుకుంటున్నా')

‘అర్జున్‌, నేను మంచి స్నేహితులం. లార్డ్స్‌ మైదానానికి ప్రాక్టీస్‌ చేయడానికి అతడు వస్తుండేవాడు. అప్పుడు కొత్త బంతితో నాకు బౌలింగ్‌ చేయాలని అడిగితే అర్జున్‌ భయపెట్టేవాడు. నేను వేసే బౌన్సర్లు నీ తలకు తగులుతాయి అని హెచ్చరించేవాడు. దీంతో అతడి బౌలింగ్‌లో బ్యాటింగ్‌ చేసేందుకు ఇష్టపడను. అంతేకాకుండా అతడి బౌలింగ్‌ను ఎదుర్కోవడం చాలా కష్టం. ఆటగాడిగా మెరుగవుతున్నాడు. త్వరలోనే అంతర్జాతయ క్రికెట్‌లో అతడిని చూసే అవకాశం ఉంది. ఇక అర్జున్‌ వాళ్ల అమ్మ అంజలితో తరుచూ మాట్లాడతా. చాలా మంచి వ్యక్తి. సచిన్‌, అంజలిలు ఇంగ్లండ్‌కు వచ్చిన ప్రతీసారి వారిని కలుస్తాను’ అని డానియల్‌ వ్యాట్‌ వ్యాఖ్యానించారు. ఇక మహిళల ప్రపంచకప్‌ -2017 గెలిచిన ఇంగ్లండ్‌ జట్టలో వ్యాట్‌ కీలక ప్లేయర్‌ అన్న విషయం తెలిసిందే. ఇం​గ్లండ్‌ తరుపును ఆమె ఇప్పటివరకు 74 వన్డేలు, 109 టీ20లకు ప్రాతినిథ్యం వహించారు. (‘అప్పుడు సుశాంత్‌కు ఎన్నో గాయాలయ్యాయి’)

మరిన్ని వార్తలు