సఫారీల సూపర్ ఛేజ్

6 Oct, 2016 23:45 IST|Sakshi
సఫారీల సూపర్ ఛేజ్

372 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన దక్షిణాఫ్రికా
ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ కైవసం
మిల్లర్ సంచలన సెంచరీ 


సరిగ్గా పదేళ్ల క్రితం... 2006లో ఆస్ట్రేలియా జట్టు 434 పరుగులు చేస్తే... దక్షిణాఫ్రికా 438 పరుగులతో దానిని ఛేదించి సంచలనం సృష్టించింది. ఇప్పటికీ వన్డేల్లో ఏ జటై్టనా భారీ స్కోరు చేస్తే  ఆ మ్యాచ్‌ను గుర్తు చేసుకుంటారు. పదేళ్లరుునా ఆ రికార్డు చెక్కుచెదరలేదు.


మళ్లీ ఇన్నాళ్లకు 2016లో... ఆస్ట్రేలియా జట్టు 371 పరుగులు చేస్తే... దక్షిణాఫ్రికా జట్టు అలవోకగా 372 పరుగులు బాది మళ్లీ గెలిచింది. నాటి 435 పరుగుల లక్ష్యం తర్వాత... రెండో అతిపెద్ద లక్ష్య ఛేదన (372)తో రికార్డుల పుస్తకంలో రెండో స్థానంలోకి వచ్చేసింది. 2013లో ఆస్ట్రేలియాపై భారత్ 360 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఈ రికార్డు ఇంతకాలం రెండో అత్యధిక లక్ష్య ఛేదనగా ఉంది. దీనిని కూడా సఫారీలు ఊదేశారు.


డర్బన్: కలయా... మాయా...! ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఆటతీరు చూస్తే ఇలాగే అనిపిస్తుంది. ఎదురుగా భారీ లక్ష్యం... 265 పరుగుల దగ్గర మిల్లర్ మినహా స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ అంతా అవుటయ్యారు. ఈ దశలో కిల్లర్ మిల్లర్ సంచలన ఇన్నింగ్‌‌స (79 బంతుల్లో 118 నాటౌట్; 10 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆడాడు. బౌలర్‌ను అండగా పెట్టుకుని  దక్షిణాఫ్రికాను గెలిపించాడు. కింగ్‌‌సమీడ్ మైదానంలో జరిగిన మూడో వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 371 పరుగుల భారీస్కోరు చేసింది. వార్నర్ (107 బంతుల్లో 117; 13 ఫోర్లు, 2 సిక్సర్లు), స్టీవ్ స్మిత్ (107 బంతుల్లో 108; 9 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీలు చేశారు. దక్షిణాఫ్రికా జట్టు 49.2 ఓవర్లలో 6 వికెట్లకు 372 పరుగులు చేసి గెలిచింది. చివర్లో మిల్లర్‌కు తోడుగా ఫెలుక్వాయో (39 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతంగా ఆడాడు. డికాక్ (49 బంతుల్లో 70; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. మిల్లర్, ఫెలుక్వాయో ఏడో వికెట్‌కు అజేయంగా 70 బంతుల్లో 107 పరుగులు జోడించడం విశేషం. ఐదు వన్డేల సిరీస్‌ను దక్షిణాఫ్రికా మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే 3-0తో కై వసం చేసుకుంది. నాలుగో వన్డే ఆదివారం జరుగుతుంది.

 

 7 దక్షిణాఫ్రికా జట్టు ఏడు సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ గెలిచింది.

743 ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిసి చేసిన పరుగులు. గతంలో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా (872 పరుగులు; 2006), భారత్-శ్రీలంక (825 పరుగులు, 2009), ఇంగ్లండ్-శ్రీలంక (763 పరుగులు, 2015) మ్యాచ్‌లలో మాత్రమే ఇంతకంటే ఎక్కువ పరుగులు వచ్చారుు.

69  మిల్లర్ 69 బంతుల్లో సెంచరీ చేశాడు. దక్షిణాఫ్రికా తరఫున ఇది ఏడో వేగవంతమైన సెంచరీ. అరుుతే మిల్లర్‌కు ముందు ఉన్న ఆరు ఫాస్టెస్ట్  సెంచరీలన్నీ డివిలియర్స్  ఒక్కడే చేశాడు.  


స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా ఇన్నింగ్‌‌స: వార్నర్ (సి) డుమిని (బి) తాహిర్ 117; ఫించ్ (సి) రబడ (బి) తాహిర్ 53; స్టీవ్ స్మిత్ (బి) స్టెరుున్ 108; బెరుులీ (సి) డుప్లెసిస్ (బి) ఫెలుక్వాయో 28; మిషెల్ మార్ష్ (సి) మిల్లర్ (బి) స్టెరుున్ 2; హెడ్ (సి) అండ్ (బి) రబడ 35; వేడ్ నాటౌట్ 17; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 371.


వికెట్ల పతనం: 1-110; 2-234; 3-280; 4-300; 5-325; 6-371.


బౌలింగ్: స్టెరుున్ 10-0-96-2; రబడ 10-0-86-1; ప్రెటోరియస్ 6-0-42-0; తాహిర్ 10-0-54-2; ఫెలుక్వాయో 8-0-58-1; డుమిని 6-0-32-0.


దక్షిణాఫ్రికా ఇన్నింగ్‌‌స: డికాక్ (సి) వోరల్ (బి) ట్రైమెన్ 70; ఆమ్లా ఎల్బీడబ్ల్యు (బి) హాస్టింగ్‌‌స 45; డు ఫ్లెసిస్ (సి) వార్నర్ (బి) హెడ్ 33; రోసో ఎల్బీడబ్ల్యు (బి) జంపా 18; డుమిని (సి) ఫించ్ (బి) హాస్టింగ్‌‌స 20; మిల్లర్ నాటౌట్ 118; ప్రెటోరియస్ (సి) వార్నర్ (బి) మార్ష్ 15; ఫెలుక్వాయో నాటౌట్ 42; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (49.2 ఓవర్లలో 6 వికెట్లకు) 372.


వికెట్ల పతనం: 1-66; 2-140; 3-164; 4-179; 5-217; 6-265.


బౌలింగ్: ట్రైమెన్ 10-0-65-1; వోరల్ 9-0-78-0; హాస్టింగ్‌‌స 10-0-79-2; మార్ష్ 10-0-61-1; జంపా 7.2-1-55-1; హెడ్ 3-0-31-1.

 

>
మరిన్ని వార్తలు