వార్నర్ సెంచరీ: ఆస్ట్రేలియా 331/3

2 Mar, 2014 00:59 IST|Sakshi
వార్నర్ సెంచరీ: ఆస్ట్రేలియా 331/3

 కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాతో నిర్ణాయక మూడో టెస్టును ఆస్ట్రేలియా ఘనంగా ఆరంభించింది. శనివారం టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్...

 

ఓపెనర్ డేవిడ్ వార్నర్ (152 బంతుల్లో 135; 12 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీకితోడు కెప్టెన్ క్లార్క్ (92 బ్యాటింగ్; 9 ఫోర్లు), స్టీవెన్ స్మిత్ (50 బ్యాటింగ్; 6 ఫోర్లు, 1 సిక్స్)లు రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది. 65 పరుగుల వద్ద రోజర్స్ (25)ను స్టెయిన్, 138 పరుగుల వద్ద డూలన్ (20)ను ఫిలాండర్ వెనక్కి పంపినా.. వార్నర్ దూకుడైన ఆటతీరుతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

 

ఈ దశలో స్టెయిన్‌కు తొడ కండరాలు పట్టేయడంతో మైదానం వీడటం ఆసీస్‌కు కలిసొచ్చింది. వార్నర్‌ను డుమినీ ఔట్ చేసినా క్లార్క్-స్మిత్ జంట నాలుగో వికెట్‌కు అజేయంగా 114 పరుగులు జోడించి భారీ స్కోరుకు బాటలు వేసింది. మూడు టెస్టుల ఈ సిరీస్‌లో ఇరుజట్లు 1-1తో సమంగా ఉన్న సంగతి తెలిసిందే.
 
 

మరిన్ని వార్తలు