రేపు వార్నర్‌ ‘మైండ్‌ బ్లాక్‌’ సర్‌ప్రైజ్‌!

29 May, 2020 13:09 IST|Sakshi

ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ వార్నర్‌ గత కొద్దిరోజులుగా టిక్‌టాక్‌ వీడియోలతో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్‌ హీరోలను అనుకరిస్తూ ఇప్పటికే చేసిన టిక్‌టాక్‌ వీడియోలు ఎంత హైలైట్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుట్టబొమ్మ సాంగ్‌, పొకిరి డైలాగ్‌, బాహుబలి సాంగ్‌కు తనదైన స్టైల్లో ఆకట్టుకున్నాడు వార్నర్‌. తన సతీమణి, కూతురుతో చేస్తున్న వీడియోలతో టిక్‌టాక్‌లో వార్నర్‌ ఫాలోవర్స్‌ సంఖ్య గణనీయంగానే పెరిగింది. ఈ క్రమంలో మహేశ్ బాబు‌ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని మైండ్‌ బ్లాక్‌ సాంగ్‌కు టిక్‌టాక్‌ చేయమని వార్నర్‌ను అభిమానులు కోరుతున్నారు. (వార్నర్‌ వీడియోకు రష్మిక ఫిదా)

ఇప్పటికే ఆ పాటలోని చిన్న బిట్‌కు టిక్‌టాక్‌ చేసిన వార్నర్‌, తాజాగా ఆ పాటకు సంబంధించిన పార్ట్‌1ను రేపు(శనివారం) విడుదల చేయనున్నట్లు తెలిపాడు. అయితే ‘మైండ్‌ బ్లాక్‌’ సాంగ్‌కు టిక్‌టాక్‌ అని చెప్పకుండా సర్‌ప్రైజ్‌ అంటూ ఆ పాటకు సంబంధించిన స్టెప్పులతో చిన్న హింట్‌ ఇచ్చాడు వార్నర్‌. దీంతో వార్నర్‌ తర్వాత టిక్‌టాక్‌ ‘మైండ్‌ బ్లాక్‌’అని అభిమానులు ఫిక్సయ్యారు. ఇక ‘బాహుబలి’ చిత్రంలోని ప్రభాస్‌ ఫోటోను, తన ఫోటోను జతచేస్తూ ‘మీరు మాలో ఎవర్ని ఇష్టపడుతున్నారు. మాలో ఎవరి దుస్తులు ఇష్టపడుతున్నారో చెప్పండి’అంటూ అభిమానులను వార్నర్‌ ప్రశించాడు. ఇక ఈ ఫోటోకు ‘దేవసేన ఎక్కడ’, ‘టాలీవుడ్‌లో హీరోగా ఎందుకు ట్రై చేయడం లేదు’, ‘ప్రభాస్‌ ఇండియా బాహుబలి, వార్నర్‌ ఆస్ట్రేలియా బాహుబలి’ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. (ఎన్టీఆర్‌కు వార్నర్‌ స్పెషల్‌ విషెస్!)!

If you can guess this we will release part 1 tomorrow. #dance #nochance #wife #daughter @candywarner1 250k likes 👍👍

A post shared by David Warner (@davidwarner31) on

Who’s costume do you prefer? 😂😂 @baahubalimovie #bahubali #prabhas #funny #fun

A post shared by David Warner (@davidwarner31) on

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా