వార్నర్‌ శతకం

23 Nov, 2019 05:42 IST|Sakshi

బ్రిస్బేన్‌: ఆ్రస్టేలియా డాషింగ్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (265 బంతుల్లో 151 బ్యాటింగ్‌; 10 ఫోర్లు) పాక్‌ బౌలర్ల భరతం పట్టాడు. నిషేధం తర్వాత సొంతగడ్డపై భారీ సెంచరీతో అజేయంగా నిలిచాడు. దీంతో తొలిటెస్టులో ఆసీస్‌ భారీ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. రెండో రోజు ఆటలో ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్‌లో 87 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి 312 పరుగులు చేసింది. రెండో రోజు ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఓపెనర్లు వార్నర్, బర్న్స్‌ (166 బంతుల్లో 97; 10 ఫోర్లు) ఘనమైన ఆరంభాన్నిచ్చారు.  వార్నర్, బర్న్స్‌ తొలి వికెట్‌కు 222 పరుగులు జోడించారు. తర్వాత వచ్చిన లబ్‌షేన్‌ (94 బంతుల్లో 55 బ్యాటింగ్‌; 6 ఫోర్లు) కూడా పాక్‌ బౌలర్లకు తలవంచలేదు. దీంతో మరో వికెట్‌ పడగొట్టేందుకు పాక్‌ శిబిరం చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. 

మరిన్ని వార్తలు