నేను..నీ ముందు తేలిపోయా: వార్నర్‌

31 May, 2020 16:00 IST|Sakshi

క్రికెటర్‌గా బిజీ బిజీగా ఉండే ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ కరోనా లాక్‌డౌన్‌ సమయంలోనూ తీరిక లేకుండా గడుపుతున్నారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు సారథ్యం వహిస్తున్న వార్నర్‌ తెలుగు సూపర్‌ హిట్‌ సినిమా పాటలకు భార్యతో కలిసి టిక్‌టాక్‌ చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. వారు చేసిన టిక్‌టాక్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌​ కూడా అవుతున్నాయి. తాజాగా ఈ దంపతులు సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని మైండ్‌ బ్లాక్‌ పాటకు స్టెప్పులేశారు.

దాదాపు 50 టేక్‌ల అనంతరం తాము సక్సెస్‌ అయ్యామని ట్విటర్‌లో ఆ వీడియోను శనివారం షేర్‌ చేశాడు. అయితే, వార్నర్‌ దంపతులు అదే పాటకు ఆదివారం కూడా స్టెప్పులేశారు. ఈ సందర్భంగా.. తన భార్య కాండిస్‌ మాదిరిగా తాను డ్యాన్స్‌ చేయలేకపోయానని వార్నర్‌ చెప్పుకొచ్చాడు. మైండ్‌ బ్లాక్‌ పార్ట్‌-2 లో ఆమె డ్యాన్స్‌ ఇరగదీసిందని మెచ్చుకున్నాడు. దీనికి మూడో పార్ట్‌ కూడా ఉంటుందని వార్నర్‌ చెప్పుకొచ్చాడు. ‘ డియర్‌.. నీ ముందు తేలిపోయా.. నేను చెత్తగా డ్యాన్స్‌ చేశా. నువ్వు మాత్రం స్టెప్పులతో ఇరదీశావ్‌. మరో పార్ట్‌తో ముందుకొస్తాం’ అని వార్నర్‌ తెలిపాడు.
(చదవండి: ‘మైండ్‌ బ్లాక్‌’తో వచ్చిన వార్నర్‌..)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా