సొంతగడ్డపై వార్నర్‌ తొలిసారి!

21 Jul, 2018 13:25 IST|Sakshi

డార్విన్‌: బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదం కారణంగా ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ఆసీస్‌ డాషింగ్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార‍్నర్‌ ఇప్పుడు లీగ్‌ మ్యాచ్‌ల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల కెనడాలో జరిగిన గ్లోబల్‌ టీ20 లీగ్‌లో వార్నర్‌ ఆడగా, తాజాగా ఆస్ట్రేలియాలో డార్విన్స్‌ లిమిటెడ్‌ ఓవర్స్‌ స్ట్రైక్‌ లీగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ లీగ్‌లో సిటీ సైక్లోన్‌ తరపున వార్నర్‌ ఆడుతున్నాడు.  దీనిలో భాగంగా నార్త్‌రన్‌ టైడ్‌ జరిగిన మ్యాచ్‌లో  36 పరుగులతో వార‍్నర్‌ ఫర్వాలేదనిపించాడు.

కొన్నినెలల క్రితం దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో వార‍్నర్‌, స్టీవ్‌ స్మిత్‌, బాన్‌క్రాఫ్ట్‌లు ట్యాంపరింగ్‌ వివాదంలో చిక‍్కుకుని నిషేధానికి గురయ్యారు. వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌లపై ఏడాది పాటు అంతర్జాతీయ నిషేధం విధించగా, బాన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల నిషేధం పడింది. అయితే దేశవాళీ లీగ్‌ల్లో ఆడేందుకు క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) అనుమతి ఇచ్చిన క్రమంలో ఈ త్రయం లీగ్‌ల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. అయితే ట్యాంపరింగ్‌ ఉదంతం తర్వాత వార‍్నర్‌ ఆస్ట్రేలియాలో క్రికెట్‌ మ్యాచ్‌ ఆడటం ఇదే తొలిసారి. అంతకుముందు కెనడా గ్లోబల్‌ టీ20లో ఆడిన వార్నర్‌.. ఇప్పుడు స్వదేశంలో జరిగే పరిమిత ఓవర్ల లీగ్‌ల్లో సైతం ఆడేందుకు మొగ్గుచూపుతున్నాడు.

మరిన్ని వార్తలు