సీఏకు వార్నర్ స్ట్రాంగ్ వార్నింగ్

5 Jun, 2017 16:03 IST|Sakshi
సీఏకు వార్నర్ స్ట్రాంగ్ వార్నింగ్

సిడ్నీ: క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ)కు ఆ దేశ క్రికెటర్లకు మధ్య కొనసాగుతున్న నూతన కాంట్రాక్ట్‌ వివాదం మరింత ముదురుతోంది. తమ షరతులకు లోబడి అంగీకారం తెలిపిన వారికి మాత్రమే కొత్త కాంట్రాక్ట్ను ఇస్తామంటూ సీఏ నిబంధనను ఆసీస్ స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ తీవ్రంగా తప్పుబట్టాడు. ఆ కాంట్రాక్ట్ విధానాన్ని ఎట్టిపరిస్థితిల్లోనూ ఒప్పుకునేది లేదని స్పష్టం చేశాడు.  పలువురు ఆటగాళ్ల తరపున వకాల్తా పుచ్చుకున్న వార్నర్.. జూలై1వ తేదీ తరువాత తమకు కాంట్రాక్ట్ కనుక లేకపోతే క్రికెట్ ను ఆడటం ఆపేస్తాం అంటూ సీఏను గట్టిగా హెచ్చరించాడు.

'ఆసీస్ కొత్త విధానం ప్రకారం మేము నిరోద్యుగులమైతే కాంట్రాక్ట్లు కూడా ఉండవు అనేది మాకు తెలుసు.అప్పుడు క్రికెట్ ఆడటం కూడా జరగదు. మా బోర్డు కచ్చితంగా కొత్త కాంట్రాక్ట్ విధానంపై అగ్రిమెంట్ చేయాలంటూ ఆటగాళ్లకు దగ్గరకు వస్తుంది. అప్పుడు మేము నిరుద్యోగులు అవుతామనే అనుకుంటున్నా. జూలై 1 తరువాత ఏమి జరుగుతుందో చూద్దాం. ప్రస్తుతం ఉన్న చాలా మంది కాంట్రాక్ట్ ఆటగాళ్ల కాంట్రాక్ట్ ను పునరుద్ధించేందుకు సీఏ సుముఖం లేదనేది ఈ మెయిల్స్ ద్వారా తెలుస్తుంది. ఇది చివరకు ఎక్కడ దారి తీస్తుందో అనేది కాలమే నిర్ణయిస్తుంది' అని చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్ లో ఉన్న వార్నర్ మండిపడ్డాడు.

మరిన్ని వార్తలు