వార్నర్‌ పశ్చాతాపంపై నెటిజన్ల ఫైర్‌

31 Mar, 2018 18:40 IST|Sakshi
డేవిడ్‌ వార్నర్‌

‘బెస్ట్‌ టెలివిజన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు ఇవ్వొచ్చంటూ సెటైర్‌

సిడ్నీ : బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో తప్పంతా తనదేనని ఆస్ట్రేలియా డాషింగ్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ మరోసారి మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. శనివారం మీడియా సమావేశంలో వార్నర్‌ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమయ్యాడు. అయితే వార్నర్‌ ఇలా కన్నీళ్లు పెట్టుకోవడంపై అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. వార్నర్‌ది నకీలీ ఏడుపని కొందరంటే, ఆస్కార్‌ నటులను మించిపోయాడని మరి కొందరు కామెంట్‌ చేస్తున్నారు. ఇంకొందరైతే వార్నర్‌కు బెస్ట్‌ టెలివిజన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు ఇవ్వొచ్చని సెటైరేస్తున్నారు. మీడియా అడిగిన ప్రశ్నల నుంచి ఎలా తప్పించుకున్నాడో గమనించారా అని కొందరు ట్రోల్‌ చేస్తున్నారు.

ఈ మీడియా సమావేశంలో వార్నర్‌ అభిమానులకు క్షమాపణలు తెలియజేస్తూ జీవితంలో ఆస్ట్రేలియా తరఫున క్రికెట్‌ ఆడనని వెల్లడించాడు. కుటుంబంతో చర్చించిన అనంతరం క్రికెట్‌ నుంచి శాశ్వతంగా తప్పుకోవాలనే అంశంపై కూడా నిర్ణయం తీసుకుంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై వార్నర్‌ పునరాలోచన చేయాలని అతని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. తప్పులు అందరు చేస్తారని కానీ చేసిన తప్పును ఒప్పుకోవడం పెద్ద విషయమని, వార్నర్‌కు మద్దతివ్వాలని అతని అభిమానులు కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు