ఎన్టీఆర్‌కు వార్నర్‌ స్పెషల్‌ విషెస్!

20 May, 2020 12:49 IST|Sakshi

పక్కా లోకల్‌ పాటతో ఎన్టీఆర్‌కు వార్నర్‌ విషెస్‌

లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాడు. భార్యాపిల్లలతో కలిసి టిక్‌టాక్‌ వీడియోలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. ఐపీఎల్‌ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన వార్నర్‌.. హైదరాబాదీలకు చేరువైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాలీవుడ్‌ ఫ్యాన్స్‌ కోరిక మేరకు తెలుగు పాటలకు స్టెప్పులేస్తూ టిక్‌టాక్‌లో సందడి చేస్తున్నాడు. అభిమానులు కోరిందే తడవుగా వీడియోలు అప్‌లోడ్‌ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు.(వార్నర్‌ కుమ్మేస్తున్నాడుగా..!)

ఇక ఈరోజు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు విషెస్‌ చెప్పాల్సిందిగా ఓ అభిమాని వార్నర్‌ను కోరాడు. ఇందుకు సానుకూలంగా స్పందించిన వార్నర్‌... ‘‘హ్యాపీ బర్త్‌డే జూనియర్‌ ఎన్టీఆర్‌’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు. అంతేకాదు.. జనతా గ్యారేజ్‌ సినిమాలోని పక్కా లోకల్‌ పాటకు భార్య కాండిస్‌తో కలిసి కాలు కదిపిన టిక్‌టాక్‌ వీడియోను షేర్‌ చేసి.. ‘‘మేం ప్రయత్నించాం కానీ.. ఈ డ్యాన్స్‌ చాలా ఫాస్ట్‌గా ఉంది’’ అంటూ సరదాగా క్యాప్షన్‌ జోడించాడు. దీంతో ఖుషీ అయిన ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ వార్నర్‌కు థాంక్స్‌ చెబుతున్నారు. కాగా జూనియర్‌ ఎన్టీఆర్‌ నేటితో 37వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా ప్రముఖులు, అభిమానుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. (బెస్ట్‌ గిఫ్ట్‌ ఇస్తాను : చరణ్‌)    

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా