సన్‌రైజర్స్‌కు వార్నర్‌ విషెస్‌

25 May, 2018 16:43 IST|Sakshi
డేవిడ్‌ వార్నర్‌

సాక్షి, హైదరాబాద్ ‌: కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో కీలక సమరానికి సిద్దమైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు మాజీ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ విషెస్‌ తెలియజేశాడు. తన సారథ్యంలో 2016 సీజన్‌లో సన్‌రైజర్స్‌ను విజేతగా నిలిపిన విషయం తెలిసిందే. బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంలో ఈ సీజన్‌కు దూరమైన వార్నర్‌ జట్టు టైటిల్‌ గెలవాలని పరితపిస్తున్నాడు. మరి కొద్ది గంటల్లో ప్రారంభమయ్యే కీలక సమరానికి ముందు ట్విటర్‌ వేదికగా జట్టుకు బెస్ట్‌ విషెస్‌ తెలియజేశాడు. ‘‘  ఈ రాత్రి సన్‌రైజర్స్‌కు అదృష్టం కలిసిరావాలి. హైదరబాద్‌ ప్రజలు గర్వించేలా చేయాలి’ ’అని వార్నర్‌ ఆకాంక్షించాడు. ఇక ఈ ట్వీట్‌కు హైదరాబాదీలు ఫిదా అయ్యారు. నిన్నెంతో మిస్సయ్యాం చాంప్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. హార్డ్‌కోర్‌ ఫ్యాన్స్‌ అయితే నువ్వుంటే అయిపోవు వార్నర్‌.. ఒక్కడే(విలియమ్సన్‌) అయిపోడు అని అభిప్రాయపడుతున్నారు.

బాల్‌ ట్యాంపరింగ్‌ విషాదం అనంతరం ఆటకు, సోషల్‌ మీడియాకు దూరమైన వార్నర్‌ ఆ సంఘటన నుంచి ఇప్పడిప్పుడే కోలుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు తన అభిప్రాయాలను సతీమణి క్యాండీస్‌ ద్వారా తెలియజేసిన వార్నర్‌ తన ట్విటర్‌ అకౌంట్‌ ద్వారా స్పందించడం మొదలుపెట్టాడు. సీజన్‌ ప్రారంభంలో సన్‌రైజర్స్‌కు విషెస్‌ తెలియజేసిన వార్నర్‌ చెన్నైతో జరిగిన క్వాలిఫైయర్‌-1కు ముందు జట్టుకు విషెస్‌ తెలిపాడు. ప్రస్తుత కెప్టెన్‌ విలియమ్సన్‌ను కొనియాడుతూ జట్టు​కు విషెస్‌ తెలియజేశాడు.

మరిన్ని వార్తలు