సింగ్‌ సిక్సర్ల విధ్వంసానికి 11 ఏళ్లు!

19 Sep, 2018 16:06 IST|Sakshi
యువరాజ్‌ సింగ్‌ (ఫైల్‌ ఫొటో)

హైదరాబాద్‌ : ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్ లు... ఈ మాట వినగానే ముందు గుర్తొచ్చేది విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ యువరాజ్‌ సింగ్‌. 2007 ప్రపంచకప్ సందర్భంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్‌ బ్రాడ్ బౌలింగ్ వేస్తున్న వేళ, సిక్సర్ల మోత మోగించిన యువీ పెను సంచలనం సృష్టించాడు. సరిగ్గా 11 ఏళ్ల క్రితం ఇదే రోజు డర్భన్‌ వేదికగా యువీ బ్రాడ్‌ బౌలింగ్‌ను చీల్చిచెండాడాడు. ఈ విధ్వంసానికి యావత్‌ క్రికెట్‌ ప్రపంచం నివ్వెరపోయింది.

అప్పటికే ప్రస్తుత టీమిండియా హెడ్‌కోచ్‌  రవిశాస్త్రి, హెర్ష్‌లీ గిబ్స్‌లు ఈ ఘనతను అందుకున్నా.. అంతగా ఆదరణ పొందలేదు. రవిశాస్త్రి దేశవాళి క్రికెట్‌లో ఈ ఘనత సాధించగా.. గిబ్స్‌ చిన్నదేశంపై అంతర్జాతీయ మ్యాచ్‌లోనే ఈ ఫీట్‌ను నెలకొల్పాడు. కానీ యువరాజ్‌ సింగ్‌ క్రికెట్‌ పుట్టిన దేశం ఇంగ్లండ్‌పైనే ఈ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో యువీ కేవలం 16 బంతుల్లోనే 58 పరుగులు చేసి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు.

మరిన్ని వార్తలు