డీ కాక్ మళ్లీ ఇరగదీశాడు!

14 Nov, 2016 12:02 IST|Sakshi
డీ కాక్ మళ్లీ ఇరగదీశాడు!

హోబార్ట్: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్ ల్లో హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్న దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు డీ కాక్.. రెండో టెస్టులో కూడా ఇరగదీశాడు. మూడో రోజు ఆటలో భాగంగా దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో డీ కాక్(104;143 బంతుల్లో 17 ఫోర్లు) శతకం నమోదు చేశాడు. దక్షిణాఫ్రికా జట్టు 132 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన సమయంలో డీకాక్ ఆకట్టుకున్నాడు. మరో క్రికెటర్ బావుమాతో కలిసి 144 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి దక్షిణాఫ్రికాను పటిష్టస్థితికి చేర్చాడు. ఈ క్రమంలోనే బావుమా(74;204 బంతుల్లో 8 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు.

 

ఆ తరువాత ఫిలిండర్(32) ఫర్వాలేదనిపించడంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 326 పరుగులు చేసింది.  దాంతో దక్షిణాఫ్రికాకు 241 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన ఆస్ట్రేలియా 79 పరుగుల వద్ద రెండో వికెట్ ను కోల్పోయింది. బర్న్స్ డకౌట్ గా వెనుదిరగగా, వార్నర్(45) రెండో వికెట్ గా అవుటయ్యాడు. ఈ రోజు ఆటలో ఆసీస్ స్కోరు వికెట్ నష్టానికి 77 పరుగుల వద్ద ఉండగా వర్షం పడింది. అయితే వర్షం తెరుపు ఇవ్వడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. మ్యాచ్ ప్రారంభమైన కొద్ది సేపటికీ వార్నర్ ను అబాట్ అవుట్ చేశాడు.


రెండో డో రోజు ఆట వర్షం వల్ల పూర్తిగా రద్దయిన సంగతి తెలిసిందే. 171/5 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా..ఆస్ట్రేలియా బౌలర్లకు పరీక్షగా నిలిచింది. పూర్తిస్థాయి నిలకడతో దక్షిణాఫ్రికా పరిస్థితిని చక్కదిద్దింది.అయితే సెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికి డీకాక్ ఆరో వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఆ తరువాత బావుమా కూడా అవుటయ్యాడు.ఆసీస్ బౌలర్లలో హజల్ వుడ్  ఆరు వికెట్లు సాధించగా, స్టార్క్ కు మూడు వికెట్లు లభించాయి.

మరిన్ని వార్తలు