ఎల్గర్‌ను ఆడేసుకుంటున్నారు..!

21 Oct, 2019 11:51 IST|Sakshi

రాంచీ: భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్న దక్షిణాఫ్రికా ఓపెనర్‌ డీన్‌ ఎల్గర్‌ అనవసరంగా నోరు జారి విమర్శలను కొనితెచ్చుకున్నాడు. భారత్‌లో హోటళ్లు ఇరుకుగా ఉంటాయని, ఫుడ్‌ కూడా పెద్దగా బాగోదని ఎల్గర్‌ అనవసర రాద్ధాంతానికి తెరలేపాడు. దాంతో ఎల్గర్‌ను నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. ఫుడ్‌, హోటళ్లు కాదు.. ముందు ఆట మీద దృష్టి పెట్టు అంటూ ఎద్దేవా చేస్తున్నారు.

‘ ఇప్పుడు నీ ఫెయిల్యూర్స్‌కు భారత్‌లో హోటళ్లు, ఫుడ్‌ బాలేదని నువ్వు దక్షిణాఫ్రికాకు వెళ్లిన తర్వాత మీ బోర్డుకు వివరణ ఇస్తావేంటి’ అని ఒక నెటిజన్‌ ప్రశ్నించగా, ‘ నువ్వు విఫలం అయ్యావ్‌ కదా.. విమర్శించడానికి ఏదొకటి ఉండాలి. అందులో భారత్‌లోని హోటళ్లు, ఫుడ్‌ ఉన్నా తప్పులేదు కదా ఎల్గర్‌’ అని మరొకరు సెటైర్‌ వేశాడు. ‘ గంగూలీ ప్లీజ్‌.. వాళ్లు మూడో టెస్టు ఓడిపోకుండా ఉండాలంటే మంచి హోటళ్లు బుక్‌ చేయండి పాపం’ అని మరొకరు విమర్శించారు.

‘ క్వాలిటీ హోటళ్ల కోసం మాట్లాడుతున్నాడు. ఫుడ్‌ సరిగా లేకపోవడం, ఇరుకు హోటళ్లు అతని ఆటపై ప్రభావం చూపుతుందంట. నువ్వే వంట చేసుకో ఎల్గర్‌.  అప్పుడు భారత క్రికెటర్లు నీకు వడ్డిస్తారు’ అని మరొక అభిమాని కోరాడు. ‘ ఎల్గర్‌కు ఏంటిల్లా-ముకేశ్‌ అంబానీ హౌజ్‌లు బుక్‌ చేయండి. అతనికి భారత హోటళ్లు సెట్‌ కాలేదంట. అతను మన గెస్ట్‌.. గెస్ట్‌ను గౌరవించాలి కదా’ మరొకరు సుతిమెత్తని విమర్శలు సంధించారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా