ఈసారి కోహ్లిని ఎగతాళి చేస్తూ..

24 Oct, 2017 11:27 IST|Sakshi

ముంబై: ఇటీవల భారత్ తో జరిగిన వన్డే సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో తమ జట్టు ఓటమి పాలుకావడాన్ని జీర్ణించుకోలేని ఆసీస్ ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత డీన్ జోన్స్.. భారత్ గెలుపుకు వర్షమే కారణమని వ్యాఖ్యానించి నవ్వుల పాలైన సంగతి తెలిసిందే. భారత జట్టు విజయం సాధించాలంటే వర్షం పడాలేమో అని వ్యాఖ్యానించాడు. దాంతో భారత అభిమానులు జోన్స్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నీకేమైనా బ్రెయిన్ ఫేడ్ అయ్యిందా అంటూ క్రికెట్ ఫ్యాన్స్ మండిపడ్డారు. ఆసీస్ క్రికెట్ జట్టు తొండాటను ఆడటంలో ఎప్పుడూ ముందుంటుందని, దానికి ఆ దేశ మాజీ క్రికెటర్లు మద్దతుగా నిలుస్తారనడానికి ఇదే నిదర్శమని విమర్శల వర్షం కురిసింది.


అయితే ఈసారి న్యూజిలాండ్ తో సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సెంచరీని  ఎగతాళి చేస్తూ డీన్ జోన్స్ ట్వీట్ చేశాడు. విరాట్ కోహ్లి ఆట బాగుంది. కానీ మళ్లీ అది న్యూజిలాండ్ అంటూ జోన్స్ ఎగతాళి చేశాడు. దీనిపై భారత అభిమానులు మండిపడుతున్నారు. కివీస్ ఆటను చూసి ఆసీస్ నేర్చుకోవాలంటూ జోన్స్ కు కౌంటర్ ఇచ్చారు. ఆసీస్ కన్నా న్యూజిలాండ్ గట్టి జట్టు అనే విషయం తెలుసుకోవాలని చురకలంటించారు. మీరు 4-1 తో ఓడారు.. మళ్లీ ఓడాలంటే రండి అంటూ ఒక నెటిజన్ ఘాటుగా తిప్పికొట్టాడు. దీంతో ఆయనకు భారత అభిమానులు చురకలు అంటిస్తున్నారు. కివీస్‌ను చూసి ఆసీస్‌ క్రికెట్‌ ఆడటం నేర్చుకోవాలని అంటున్నారు. ఆసీస్‌ కన్నా కివీసే గట్టి జట్టు అని మరొకరు దెప్పిపొడిచారు. వారు గెలిచారు.. మీరు 4-1తో ఓడారు.. సాక్ష్యం కావాలంటే మళ్లీ రండి బాబూ అని ఓ నెటిజన్‌ గట్టిగా బదులిచ్చాడు.

న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డే విరాట్ కు 200వ వన్డే. ఆ మ్యాచ్ లో విరాట్ సెంచరీ చేసి తన కెరీర్ లో 31వ వన్డే సెంచరీ సాధించాడు. తద్వారా వన్డేల్లో అత్యధిక శతకాలు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలోనే ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డును కోహ్లి బద్దలు కొట్టాడు.

మరిన్ని వార్తలు