ప్రొ రెజ్లింగ్ లీగ్ జట్ల ప్రకటన

22 Nov, 2015 02:00 IST|Sakshi
న్యూఢిల్లీ: భారత్‌లో తొలిసారి నిర్వహించనున్న ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)లో పాల్గొంటున్న ఆరు ఫ్రాంచైజీల పేర్లను నిర్వాహకులు ప్రకటించారు. ఢిల్లీ వీర్ (జీఎంఆర్ గ్రూప్), బెంగళూరు యోధ (జేఎస్‌డబ్ల్యూ గ్రూప్), సీడీఆర్ పంజాబ్ రాయల్స్ (సీడీఆర్ గ్రూప్, నటుడు ధర్మేంద్ర), యూపీ వారియర్స్ (లోటస్ గ్రీన్), హరియాణా హ్యామర్స్ (ఓలివ్ గ్లోబల్), ముంబైచీ గరుడే (మావెరిక్ ఇండస్ట్రీస్, మఫత్‌లాల్, గరడాచార్య)ల తరఫున ప్రపంచ స్థాయి రెజ్లర్లు బరిలోకి దిగనున్నారని లీగ్ నిర్వాహకులు ప్రోస్పోర్టిఫై తెలిపింది. ఈ టోర్నీ డిసెంబర్ 10 నుంచి జరుగుతుంది.   
 
మరిన్ని వార్తలు