ప్రపంచ ఉత్తమ జూనియర్‌ రెజ్లర్‌ దీపక్‌

18 Dec, 2019 01:50 IST|Sakshi
దీపక్‌ పూనియా

యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ వార్షిక అవార్డులు

న్యూఢిల్లీ: ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై అద్భుత ప్రదర్శన చేసిన భారత యువ రెజ్లర్‌ దీపక్‌ పూనియాకు తగిన గుర్తింపు లభించింది. యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ (యూడబ్ల్యూడబ్ల్యూ) వార్షిక పురస్కారాల్లో 18 ఏళ్ల దీపక్‌ ‘జూనియర్‌ ఫ్రీస్టయిల్‌ రెజ్లర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా ఎంపికయ్యాడు. ఈ సంవత్సరం దీపక్‌ జూనియర్‌తోపాటు సీనియర్‌ విభాగంలోనూ మెరిశాడు. ఆగస్టులో ఎస్తోనియాలో జరిగిన ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌íÙప్‌లో 86 కేజీల విభాగంలో దీపక్‌ విజేతగా నిలిచి స్వర్ణం సాధించాడు. ఈ క్రమంలో 18 ఏళ్ల తర్వాత జూనియర్‌ ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తొలి భారత రెజ్లర్‌గా అతను ఘనత సాధించాడు.

అనంతరం సెపె్టంబరులో కజకిస్తాన్‌ రాజధాని నూర్‌ సుల్తాన్‌లో జరిగిన ప్రపంచ సీనియర్‌ చాంపియన్‌íÙప్‌లో 86 కేజీల విభాగంలో రెండో స్థానంలో నిలిచి రజతం గెలిచాడు. దాంతోపాటు వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఈ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌నూ సొంతం చేసుకున్నాడు. ‘చాలా సంతోషంగా ఉన్నాను. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జూనియర్‌ రెజ్లర్లలో నన్ను మేటి రెజ్లర్‌గా గుర్తించినందుకు గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఈ అవార్డు నాలో మరింత ఉత్సాహన్ని పెంచుతుంది’ అని 2016లో క్యాడెట్‌ ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన దీపక్‌ వ్యాఖ్యానించాడు. 

మరిన్ని వార్తలు