దీపక్‌ పూనియా, రవి దహియాలు క్వాలిఫై

3 Jan, 2020 16:27 IST|Sakshi

న్యూఢిల్లీ:  వచ్చే నెలలలో జరుగనున్న సీనియర్‌ ఆసియా చాంపియన్‌షిప్‌కు రెజ‍్లర్లు దీపక్‌ పూనియా, రవి దహియాలు క్వాలిఫై అయ్యారు. శుక‍్రవారం జరిగిన రెజ్లింగ్‌ ట్రయల్స్‌లో దీపక్‌ పూనియా, రవి దహియాలు తమ తమ కేటగిరిల్లో విజయం సాధించడంతో ఆసియా చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించారు. 86 కేజీల ఫ్రీ స్టైల్‌ కేటగిరీలో దీపక్‌ పూనియా.. కామన్వెల్త్‌ కాంస్య పతక విజేత పవన్‌ కుమార్‌పై విజయం సాధించగా, 57 కేజీల వెయిట్‌ కేటగిరీలో రవి దహియా 10-0 తేడాతో పంకజ్‌పై గెలుపొందాడు. దాంతో ఆసియా చాంపియనషిప్‌కు క్వాలిఫై అయ్యారు.

ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన వీరిద్దరూ తాజాగా ఆసియా చాంపియన్‌షిప్‌కు సైతం క్వాలిఫై కావడం విశేషం. విజయం తర్వాత దీపక్‌ దహియా మాట్లాడుతూ.. ‘ ఇదే ఫామ్‌ను కొనసాగించడంపైనే దృష్టి పెట్టా. నా గోల్‌, నా కల ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే.అంతర్జాతీయ టోర్నీల్లో సత్తా చాటడానికి వంద శాతం యత్నిస్తా. నా అ‍త్యున్నత ప్రదర్శనను వెలికి తీయడమే నా లక్ష్యం’ అని తెలిపాడు. ‘ నేను రెజ్లింగ్‌ను ఎంజాయ్‌ చేస్తా. ప్రస్తుతం నా అత్యుత్తమ సమయాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగుతున్నా. భారత్‌కు పతకాలు అందిస్తానని ఆశిస్తున్నా. ఒలింపిక్‌ పతకం సాధించాలనే ఒకే ఒక్క లక్ష్యంతో శ్రమిస్తున్నా’ అని రవి దహియా తెలిపాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈ భార‌త క్రికెట‌ర్ రియ‌ల్ హీరో: ఐసీసీ

దక్షిణాఫ్రికా నుంచి అమెరికాకు... 

ఆటగాళ్లూ... మీ స్థానాలు భద్రం 

భారత షాట్‌పుట్‌ క్రీడాకారుడిపై నాలుగేళ్ల నిషేధం 

ధోని కోరిక తీరకపోవచ్చు! 

సినిమా

నాలుగోసారి కూడా పాజిటివ్‌.. ఆందోళనలో కుటుంబం

నాతో నేను టైమ్‌ స్పెండ్‌ చేస్తున్నా...

కష్టాల్లో సినీ కార్మికులు : అండగా నిలిచిన మాస్‌ మహారాజా

మా ఆవిడ ఏ పని చెబితే అది: అలీ

బుల్లితెర కార్మికులకు యాంకర్‌ ప్రదీప్‌ చేయూత

కిచెన్‌ స్వాధీనం చేసుకున్న రాజేంద్రప్రసాద్‌